రాజాసాబ్ టీజర్ కట్ రెడి.. ఎలా ఉంటుందంటే..

ప్రభాస్ సినిమాలు ఇటీవల కాలంలో పాన్ ఇండియా రేంజ్ ను దాటి మార్కెట్ లో ఒక సంచలనం క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-03-24 08:58 GMT

ప్రభాస్ సినిమాలు ఇటీవల కాలంలో పాన్ ఇండియా రేంజ్ ను దాటి మార్కెట్ లో ఒక సంచలనం క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య మద్య ‘సలార్’ రీ రిలీజ్ తో పండగ చేసుకున్న అభిమానుల్లో ఎనర్జీ పెరిగింది. ఇప్పుడు అదే ఉత్సాహాన్ని ‘ది రాజాసాబ్’ సినిమాతో రెట్టింపు చేయబోతున్నారు. ఈసారి ప్రభాస్‌తో మాస్ పండుగ చూపించాలన్నదే దర్శకుడు మారుతి ప్లాన్.

ఈ సినిమా ఫ్యామిలీ, హర్రర్, కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నా, ఇప్పుడు మాత్రం సినిమా టీజర్ కోసం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కి ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే ఒక కింగ్ హారర్ లుక్ కూడా వైబ్ పెంచింది. మారుతి స్టైల్ కామెడీకి ప్రభాస్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా మిక్స్ అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే మేకర్స్ ఓ రఫ్ టీజర్ కట్ సిద్దం చేశారు. ఈ టీజర్‌ను ఇండస్ట్రీలోని కొంతమంది సన్నిహితులకు దర్శకుడు మారుతి ప్రివ్యూ చేయడం జరిగింది. టీజర్‌లో ప్రభాస్ చెప్పే ఓ డైలాగ్.. లేటెస్ట్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌కి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ టీజర్‌లో ఓ స్పెషల్ షాట్ ఉందట. అందులో థ్రిల్, స్టైల్, డ్యాన్స్ స్టెప్.. మూడూ కలిపి ఉన్నాయట.

ఇది మారుతి ఇమాజినేషన్‌కు నిదర్శనంగా మారిందంటూ ప్రివ్యూ చూసినవారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ షాట్ అభిమానుల్లో పూనకాలెత్తేలా ఉందని ఫీడ్‌బ్యాక్ రావడంతో మేకర్స్ టీజర్ రిలీజ్ టైమ్‌పైనా మెల్లిగా ప్రణాళిక వేసుకుంటున్నారు. ఫ్యాన్స్‌కి ఇది ‘నెవర్ బిఫోర్’ ప్రభాస్ ట్రీట్ అవుతుందని టాక్ బలంగా ఉంది. గతంలో ఇది హారర్ టచ్‌లో మిక్స్ కామెడీగా ఉంటుందని ఊహించినవారికి, ఇప్పుడు మాత్రం విజువల్ ట్రీట్‌తో మరో లెవల్‌లో మాస్ యాంగిల్ కనిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ చూసుకుంటే ఆయన ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌కి ట్రీట్స్ ఇస్తున్నారని అర్థమవుతుంది. ‘ది రాజాసాబ్’ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2898 ఏడి’ ఫైనల్ పార్ట్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్ సీక్వెల్ మొదలవుతుంది.

ఇప్పటికే ‘కన్నప్ప’లో అతిథి పాత్ర చేసిన ప్రభాస్… ఈ ఏడాది జూన్/జులై లో ‘ది రాజాసాబ్’ తో అభిమానుల్ని థియేటర్‌కి దించబోతున్నారు. ఇప్పటి దాకా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను బట్టి చూస్తే, మారుతి – ప్రభాస్ కాంబినేషన్‌కి మంచి ఊపు వస్తోంది. మొదట్లో కొన్ని అనుమానాలు ఉన్నా, ఇప్పుడు మాత్రం టీజర్ రఫ్ కట్ చూసినవారంతా ఫుల్ పాజిటివ్ ఫీల్‌తో ఉన్నారు. ముఖ్యంగా డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, లుక్ అన్నీ కాంబినేషన్‌గా ప్రభాస్‌ని మాస్ మూడ్‌లో చూపించబోతున్నారని చెప్పవచ్చు. ఇక టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ ఇప్పుడు కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.

Tags:    

Similar News