పబ్లిక్ లో లిప్ లాక్..ఆమె ఓపెన్ బుక్ టైప్!
దిగితేగానీ లోతు ఎంత? అన్నది తెలియదంటారు. ఒక్కసారి దిగిన తర్వాత లోతు ఎంతైనా ఈదాల్సిందే. ఒడ్డుకు చేరాల్సిందే.;

దిగితేగానీ లోతు ఎంత? అన్నది తెలియదంటారు. ఒక్కసారి దిగిన తర్వాత లోతు ఎంతైనా ఈదాల్సిందే. ఒడ్డుకు చేరాల్సిందే. సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది మాలీవుడ్ బ్యూటీ సురభి లక్ష్మికి. ఈ బ్యూటీ మాలీవుడ్ చిత్రం `రైఫిల్ క్లబ్` లో నటుడు సంజీవ్ చెట్టన్ తో వేసిన లిప్ లాక్ నెట్టింట వైరల్ గా మారింది. అమ్మడు సినిమాలో తనదైన పెర్పార్మెన్స్ తో పాటు లిప్ లాక్ లాంటి రొమాంటిక్ సన్నివేశంలోనూ ఎక్కడా రాజీ పడకుండా నటించి ప్రేక్షకుల ప్రశంసలందుకుంటుంది.
అయితే ఇలాంటి లిప్ లాక్ వేస్తానని తాను ఎప్పుడు అనుకోలేదని అంతా అప్పటికప్పుడు అలా జరిగి పోయిందంది. సినిమాలో ముద్దు సన్నివేశం ఉంటుందని దర్శకుడు శ్యామ్ ముందే చెప్పాడుట. కానీ అది సాధారణ ముద్దు సీన్ అనుకున్ని వివరంగా అడగలేదుట. అది లిప్ లాక్ సీన్ అని సెట్స్ కి వెళ్లిన తర్వాత షాట్ తీసే ముందు తెలిసిందిట. కాస్త ఆశ్చర్య పడినా ఎలాంటి టెన్షన్ కి మాత్రం గురికాలేదుట.
ఆ సమయంలో భర్త పాత్ర పోషించిన సంజీవ్ కుమారన్ ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేసిందిట. టెన్షన్ గా ఉన్నావా? అని అడిగిందిట. దానికి అతడు తనకు అలాంటి టెన్షన్ లేదని బధులిచ్చారుట. అయితే సంజీవ్ కి స్మోకింగ్ అలవాటు ఉండటంతో షాట్ తీసే ముందు పళ్లు తోముకుని రమ్మందిట. అలాగే తాను పుడ్ డిపార్ట్ మెంట్ వాళ్లను పిలిచి యాలకులు తీసుకురమ్మని వాటిని నోటిలో వేసుకుని కాసేపు నమిలిన తర్వాత ఆ సన్నివేశంలో నటించినట్లు తెలిపింది.
అయినా లిప్ లాక్ సన్నివేశాలిప్పుడు చాలా సినిమాల్లో ఉన్నవే. వాటి గురించి అభ్యంతరం వ్యక్తం చేసే వారెవ్వరు లేరు. అయితే ఈ విషయంలో సురభి చాలా డేరింగ్ చేసిందని చెప్పాలి. సాధారణంగా లిప్ లాక్ సన్నివేశాల చిత్రీకరణ అన్నది గదిలో షూట్ చేస్తుంటారు. దర్శకుడు, కెమెరా మెన్, హీరో-హీరోయిన్ తప్ప ఎవరూ ఉండరు. వందలాది మంది ముందు అలాంటి సన్నివేశాల్లో నటించడానికి హీరోయిన్ ఇబ్బంది పడుతుందనే అలా ఏర్పాటు చేస్తుంటారు. కానీ సురభి మాత్రం గోప్యంగా కాకుండా అంతా ఓపెన్ ప్లేస్ లోనే లిక్ లాక్ సీన్ లో నటించడం విశేషం.