పిక్ టాక్: మోనోక్రోమ్ ఫోటోల్లో మరింత అందంగా హైబ్రిడ్ పిల్ల
ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి బ్లాక్ అండ్ ఫోటోలను షేర్ చేసి ఆడియన్స్ ను ఫిదా చేసింది.;

కొంతమంది నవ్వితే ఎంతో అందంగా కనిపిస్తారు. ఆ నవ్వుతో వచ్చే వెలుగు వారిని మరింత మెరిపిస్తుంది. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నవ్వు కూడా అలాంటిదే. సాయి పల్లవి హీరోయిన్ మెటీరియల్ కాకపోయినా ఆమెకి, ఆమె నవ్వుకి, తన సింప్లిసిటీకి చాలా మందే అభిమానులు ఉన్నారు.

సాయి పల్లవి ఏదైనా ఒక పాత్ర ఒప్పుకుంది అంటే ఆ పాత్రకు తాను 100కి 200% న్యాయం చేకూరుస్తుంది. ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ లోకి వెళ్లిపోతుంది. ఆమె నటించిన సినిమాలు ఫ్లాపయ్యాయి కానీ నటిగా సాయి పల్లవి మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ ఫెయిలైంది లేదు. అందుకే ఆమెకు అంత క్రేజ్.

ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి బ్లాక్ అండ్ ఫోటోలను షేర్ చేసి ఆడియన్స్ ను ఫిదా చేసింది. రీసెంట్ గా నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటించి భారీ సక్సెస్ ను అందుకున్న సాయి పల్లవి ఎలాంటి మేకప్ లేకుండా తన నేచురల్ అందాలను బంధించిన మోనోక్రోమ్ ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోల్లో సాయి పల్లవి వైట్ టీ షర్ట్ వేసుకుని లూజ్ హెయిర్ తో ఎంతో అందంగా కనిపించింది. ఆ ఫోటోలకు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఏదో ఉందని, అవి మనలోని నిజమైన రంగులను చూపుతాయని సాయి పల్లవి రాసుకొచ్చింది. సాయి పల్లవి షేర్ చేసిన ఈ ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తూ వాటిని షేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఇప్పటివరకు సౌత్ లో తన సత్తాను చాటిన ఈ హైబ్రిడ్ పిల్ల ఇప్పుడు నార్త్ లో తన రేంజ్ ను చాటడానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ సాయి పల్లవి నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. మామూలు కథలకే ప్రాణం పోసే సాయి పల్లవి ఇక సీత పాత్రలో ఎలాంటి నటనను కనబరుస్తుందో చూడ్డానికి ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.