ఐకాన్ స్టార్.. 22 ఏళ్ళ బ్లాక్ బస్టర్ జర్నీ!

స్టైలిష్ స్టార్ నుంచి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఐకాన్ స్టార్ వరకు అల్లు అర్జున్ చేసిన సినీ ప్రయాణం ఒక బిగ్ రికార్డ్ అనే చెప్పాలి.;

Update: 2025-03-28 08:28 GMT
Alluarjun Completes 22Years In Tollywood

స్టైలిష్ స్టార్ నుంచి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఐకాన్ స్టార్ వరకు అల్లు అర్జున్ చేసిన సినీ ప్రయాణం ఒక బిగ్ రికార్డ్ అనే చెప్పాలి. 2003లో గంగోత్రితో అరంగేట్రం చేసిన బన్నీ, మొదటి సినిమా నుంచే తన ప్రత్యేకతను చాటాడు. తర్వాత వచ్చిన ఆర్య సినిమాతో యూత్ ఐకాన్‌గా నిలిచిన అతడు.. ‘బన్నీ’, ‘దేశముదురు’, ‘పరుగు’, ‘ఆర్య 2’ లాంటి హిట్ సినిమాలతో తన స్టైల్, డాన్స్, యాక్టింగ్‌కు మాస్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు.


బన్నీ ప్రయాణంలో వేదం, జులాయి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలు నటుడిగా అతన్ని మరో లెవెల్ కు తీసుకు వెళ్లాయి. ఇప్పుడైతే ‘పుష్ప’ సినిమా అతని కెరీర్‌కు మరింత బూస్ట్ ఇచ్చింది. దర్శకుడు సుకుమార్‌తో కలిసి చేసిన ఈ మాస్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా తెరకెక్కింది. ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బన్నీకి పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను మరింత పక్కాగా తీసుకువచ్చింది.

అంతే కాకుండా, ఈ సినిమాతో బన్నీ నేషనల్ అవార్డ్ గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. ఇది అతని కెరీర్‌లోనే గోల్డెన్ మైలురాయి. పుష్ప 2 తర్వాత బన్నీ స్పీడ్ మోడ్‌లోకి వెళ్లాడు. ఇంతకాలం ఒకే ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేసిన బన్నీ, ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. రెండూ పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ అవుతున్నాయి.

రెండు సినిమాలను 2025లో బ్యాక్ టు బ్యాక్ సెట్స్‌పైకి తీసుకురావాలనే తపనతో బన్నీ ముందుకెళ్తున్నాడు. ఫ్యాషన్, హ్యాండ్‌సమ్‌నెస్, స్టైల్.. ఇలా. బన్నీ యూత్‌లో మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. గత రెండు దశాబ్దాల్లో బన్నీ చేసిన ప్రయోగాలు, విజయాలు చూసిన అభిమానులకు ఇప్పుడు అతనిలో ఉన్న విజన్ స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా స్టార్స్‌లో అత్యంత బిజీ హీరోగా ఉన్నాడు. ‘పుష్ప’ క్రేజ్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా.. దాన్ని దాటిపోయే విధంగా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాడు. 22 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులను సాధించిన అల్లు అర్జున్.. మరో రెండు దశాబ్దాలు కూడా అగ్రస్థానంలోనే ఉంటాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి అట్లీ, త్రివిక్రమ్ సినిమాలతో బన్నీ ఇంకెంత ఎత్తుకు చేరుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News