చరణ్ కు బాబాయ్ విషెస్.. గొడవేమిటంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల పుట్టినరోజులంటే అభిమానులకే కాదు, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ అవ్వకుండా ఉండదు.;

Update: 2025-03-28 06:18 GMT
చరణ్ కు బాబాయ్ విషెస్.. గొడవేమిటంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల పుట్టినరోజులంటే అభిమానులకే కాదు, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ అవ్వకుండా ఉండదు. అందులోనూ బంధుత్వం ఉంటే ఆ ప్రేమే వేరు. లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ వెల్లువెత్తాయి. సినిమా వాళ్లతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో ఒక విషెస్‌ మెగా ఫ్యాన్స్‌కి ప్రత్యేకం కాగా, విమర్శకులకు మాత్రం కొత్త చర్చకు తావిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ అధికారిక ప్రభుత్వ లెటర్‌హెడ్‌ను ఉపయోగించారు. "అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రామ్ చరణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు" అనే శైలిలో వచ్చిన ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్, చరణ్ మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే.

రాజకీయంగా జనసేన అధినేత అయినా, వ్యక్తిగతంగా పవన్ బాబాయ్ కూడా. ఈ నేపథ్యంలో ఇది ఆప్యాయతగా చేసిన చర్య అని అభిమానులు అంటున్నారు. అయితే ఇదే అంశంపై సోషల్ మీడియాలో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ లెటర్‌హెడ్‌ను వ్యక్తిగత అభినందనల కోసం వాడడం సరైనదేనా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గుర్తులను కలిగిన లెటర్‌హెడ్‌లను సున్నితమైన అంశాల కోసం మాత్రమే వాడాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఇది ఒక విధంగా ప్రభుత్వ ప్రతీకలను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించడమేనని విమర్శకులు అంటున్నారు. ఈ విషయంలో పవన్‌ను సపోర్ట్ చేసే వారు కూడా ఉన్నారు. విషెస్ చెప్పడంలో తప్పేమీ ఉంది అనే వారి వాదన ఉంది. అలాగే బహుశా పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు అనే వారు కూడా ఉన్నారు. కానీ, అదే సమయంలో ప్రభుత్వ ప్రతీకల విలువ, వాటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే అని ఇంకొంతమంది భావిస్తున్నారు.

ఇది నైతిక పరంగా మంచి ఉదాహరణ కాదని వారి వాదన. ఇక ఈ లెటర్‌హెడ్ ఇష్యూ విస్తృతంగా చర్చకు తెరతీసింది. రాజకీయ నాయకులు తమ అధికారాన్ని, అధికార గుర్తులను ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఆపాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రజల విశ్వాసం, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడాలంటే ఇటువంటి విషయాల్లో అప్రమత్తత అవసరమని.

ఇవి చిన్నచిన్న అంశాలు కావచ్చూ కానీ, అధికార వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలుగా మారతాయని అంటున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ చేసిన ఆ విషెస్ చరణ్ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినా.. ప్రభుత్వం అనే ఒక వ్యవస్థ ప్రతీకను వ్యక్తిగతంగా వాడటం సరైనదా అనే చర్చకు దారితీసింది. ఇక పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News