పిక్‌టాక్ : వీరిలో ఎవరు పెద్ద రౌడీ?
మరో వైపు ఫ్యామిలీ విభేదాలు, ఇతర కారణాల వల్ల మోహన్ బాబు వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో వీరిద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.;
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్న మంచు విష్ణు తాజాగా మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. వీరిద్దరు మళ్లీ ఇప్పుడు ఎందుకు కలిశారు అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు నటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ వరుసగా ఏపీలో కేసులను ఎదుర్కొంటూ ఉన్నాడు. మరో వైపు ఫ్యామిలీ విభేదాలు, ఇతర కారణాల వల్ల మోహన్ బాబు వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో వీరిద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.
మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన మంచు విష్ణు ఆసక్తికర కామెంట్‌ను పోస్ట్ చేశాడు. ఇది ఒక అద్భుతమైన సాయంత్రం. వీరిద్దరూ నిజమైన ఓజీస్. మోహన్ బాబు వర్మ, మంచు రామ్ గోపాల్ అంటూ ఇద్దరి పేర్లను కలిపి ట్వీట్ చేశాడు. వీరిద్దరిలో పెద్ద రౌడీ ఎవరు అని మీరు భావిస్తున్నారు అంటూ వర్మ నెటిజన్స్‌ను ఫన్నీగా ప్రశ్నించాడు. అందుకు నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇద్దరికి ఇద్దరు పెద్ద రౌడీలు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు ఒకప్పటి విషయాలను మాట్లాడుకోవడం తప్ప ప్రస్తుతం చెప్పుకోవడానికి ఇద్దరికీ ఏమీ లేదు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి ఫోటో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ ఎందుకు కలిశారు అనే విషయమై చర్చ జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ ఈమధ్య కాలంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను చాలా సీరియస్‌గా చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా వర్మ నుంచి వస్తుందేమో అనే ఆశ, ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఆ సినిమా కోసం ఏమైనా మోహన్‌బాబును వర్మ సంప్రదించి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే వర్మ దర్శకత్వంలో మరోసారి మోహన్‌బాబు నటిస్తే కచ్చితంగా మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరు సినిమాలతో కంటే వివాదాలతోనే వార్తల్లో ఉంటున్నారు.
ప్రతిభావంతులు అయిన వీరిద్దరు తిరిగి సినిమాలతో వార్తల్లో నిలవాలని చాలా మంది బలంగా కోరుకుంటున్నారు. అది వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు నటిస్తే సాధ్యం అవుతుంది అనేది పలువురి అభిప్రాయం. మోహన్ బాబు త్వరలో 'కన్నప్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మంచు విష్ణు హీరోగా నటించి భారీ బడ్జెట్‌తో నిర్మించిన కన్నప్ప సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలో మోహన్ బాబు లుక్‌కి సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే విడుదల అయ్యాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుంది అంటూ మంచు విష్ణు చాలా నమ్మకంగా చెబుతున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న కన్నప్పలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.