గాడ్ ఫాదర్ సీక్వెల్ కు ఛాన్స్ లేదు!
మలయాళ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా వస్తోన్న చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.;

మలయాళ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా వస్తోన్న చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్ గా ఎల్2: ఎంపురాన్ తెరకెక్కింది. ఈ సినిమా కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది.
ఇదిలా ఉంటే లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ సినిమా తెలుగులో కూడా థియేటర్లలో రిలీజవడమే, గాడ్ ఫాదర్ ఫ్లాప్ కు కారణమని చెప్పొచ్చు. ఆల్రెడీ మోహన్ లాల్ హీరోగా చూసిన సినిమాను మళ్లీ థియేటర్లకు వెళ్లి ఏం చూస్తాంలే అని ఆడియన్స్ గాడ్ ఫాదర్ సినిమా విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదు.
ఎల్2: ఎంపురాన్ తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొన్న మోహన్ లాల్ ను ఓ జర్నలిస్ట్ మీరు లూసిఫర్ తెలుగు రీమేక్ చూశారా అని అడిగారు. దానికి మోహన్ లాల్ తాను గాడ్ ఫాదర్ సినిమా చూశానని బదులిచ్చారు. లూసిఫర్ కథను వాళ్లు కొంచెం మార్చారని, తన నటించిన ఎన్నో సినిమాలు వేరే భాషల్లో రీమేక్ అయ్యాయని మోహన్ లాల్ అన్నారు.
ఇదే సందర్భంగా మోహన్ లాల్ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. లూసిఫర్ కు సీక్వెల్ గా ఎల్2 తీసినట్టు గాడ్ ఫాదర్ కు సీక్వెల్ గా గాడ్ ఫాదర్2 చేసే ఛాన్స్ తెలుగు వెర్షన్ కు లేదని ఆయన తెలిపారు. లూసిఫర్ లో ఉన్న కొన్ని పాత్రలు గాడ్ ఫాదర్ లో లేకపోవడం వల్ల ఎల్2 ను తెలుగులో రీమేక్ చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే గాడ్ ఫాదర్ సినిమాలో మోహన్ లాల్ చెప్పిన చిన్న మార్పుల్లో ఒకటి టోవినో థామస్ క్యారెక్టర్. గాడ్ ఫాదర్ సినిమాలో టోవినో థామస్ క్యారెక్టర్ ఉండదు. కథలో ఆయన పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదనుకుని మోహన్ రాజా ఆ క్యారెక్టర్ ను తొలగించాడు. కానీ ఇప్పుడు ఎల్2: ఎంపురాన్ ట్రైలర్ చూశాక కథను మలుపు తిప్పే పాత్ర టోవినో థామసే అనిపిస్తోంది. అందుకే మోహన్ లాల్ ఎల్2 ను తెలుగులో రీమేక్ చేయడం కష్టమని చెప్పి ఉంటారు.