సోనాలిసూద్‌ పరిస్థితి ఇప్పుడెలా ఉంది?

ఎప్పుడూ సినిమాలు, సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలిచే సోనూసూద్‌ ఈసారి ఆయన భార్య సోనాలి సూద్‌ యాక్సిడెంట్‌ కారణంగా వార్తల్లో నిలిచాడు.;

Update: 2025-03-25 10:39 GMT

ప్రముఖ నటుడు సోనూసూద్‌ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలు చేస్తున్నాడు. కేవలం విలన్‌గా మాత్రమే కాకుండా హీరోగానూ సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే సోనూసూద్‌ హీరోగా నటించిన సినిమా విడుదలైంది. మరో వైపు సోనూసూద్‌ వరుస సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ సినిమాలు, సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలిచే సోనూసూద్‌ ఈసారి ఆయన భార్య సోనాలి సూద్‌ యాక్సిడెంట్‌ కారణంగా వార్తల్లో నిలిచాడు. యాక్సిడెంట్‌ వార్తలు రాగానే అంతా షాక్ అయ్యారు. ఫ్యాన్స్‌లో ఎక్కువ శాతం మంది సోనూసూద్‌ ఆ సమయంలో కారులోనే ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో ఆయన యోగ క్షేమాల గురించి వాకబు చేశారు.

కారు ప్రమాదం జరిగిన సమయంలో సోనూసూద్‌ అందులో లేడని తేలిపోయింది. సోనాలి సూద్‌తో పాటు ఆమె సోదరి, సోదరి కుమార్తె మాత్రమే ఉన్నారట. ముంబై- నాగపూర్ హైవేపై ఈ సంఘటన జరిగింది. సోనాలి కారును డ్రైవ్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలియజేశారు. ట్రక్‌ను సోనాలి సూద్‌ ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. వెంటనే బెలూన్స్ ఓపెన్‌ కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. కారు ఎక్కువ వేగంతో వెళ్లని కారణంగా ప్రాణాలకు ప్రమాదం జరగలేదని, సోనాలికి స్వల్ప గాయాలు అయ్యాయని, ఆమె సోదరి, సోదరి కూతురుకు సైతం స్వల్ప గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

సోనాలి సూద్‌ను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రాధమిక చికిత్స అనంతరం తిరిగి ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారని ముంబై వర్గాల టాక్‌. సోనాలితో పాటు, ఆ కారులో ప్రయాణించిన ముగ్గురికి ఎలాంటి ప్రమాదం లేదని, ముగ్గురికి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ప్రాణాపాయం లేకపోవడంతో సోనూసూద్‌ అభిమానులతో పాటు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. సోనూ సూద్‌, సోనాలి ల వివాహం 1996లో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సోనూసూద్‌ సొంత బ్యానర్ ఉన్న విషయం తెల్సిందే. ఆ బ్యానర్‌లో నిర్మాణం అయ్యే సినిమాల బాధ్యతను సోనాలి చూసుకుంటూ ఉంటుంది.

కరోనా సమయంలో సోనూసూద్‌ చేసిన సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో సోనాలి పాత్ర కీలకం అంటూ ఉంటారు. వేలాది మంది ప్రాణాలు కాపాడిన సోనూసూద్‌కి లక్‌ కలిసి వచ్చిన సోనాలికి పెద్ద ప్రమాదం జరిగినా ఇబ్బంది ఏమీ లేదని సోషల్‌ మీడియాలో ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం సోనూసూద్‌ భార్య గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సోనూసూద్‌ను ట్యాగ్‌ చేస్తూ సోనాలి హెల్త్‌ అప్డేట్‌ను అడుగుతున్నారు. రియల్‌ హీరో సోనూసూద్‌ భార్యకు జరిగిన యాక్సిడెంట్‌ టాక్‌ ఆఫ్ ది ఇండియాగా మారింది.

Tags:    

Similar News