పిక్ టాక్: సూపర్ స్టైలిష్ లుక్ తారక్
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నాడు.;
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో చేస్తున్న వార్2 షూటింగ్ లో పాల్గొంటూ హైదరాబాద్, ముంబై కు తిరిగాడు. ఇప్పుడు దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లి అక్కడ సందడి చేస్తున్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేవర జపాన్ దేశంలో రిలీజ్ కు రెడీ అయింది. మార్చి 28న దేవర జపాన్ దేశ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దేవర ప్రమోషన్స్ కోసమని ఇప్పుడు ఎన్టీఆర్ జపాన్ కు వెళ్లి అక్కడ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.
ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ అక్కడి ఫ్యాన్స్ తో ఫోటోలు దిగుతూ, థియేటర్లలో దేవర లోని ఆయుధ పూజ సాంగ్ కు స్టెప్పులేస్తూ బాగానే హడావిడి చేస్తున్నాడు. అయితే జపాన్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ మరింత స్పెషల్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ అండ్ బ్లాక్ షర్ట్, ప్యాంట్ వేసుకున్న తారక్, షర్ట్ పై డిజైనర్ హుడీ వేసుకుని అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు.
లెదర్ షూస్, స్టైలిష్ కళ్లద్దాలు పెట్టుకుని సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న తారక్ కొత్త ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో బిజీ అయిపోయారు. అయితే తారక్ ఇంతకుముందు కంటే ఈ ఫోటోల్లో బాగా సన్న బడినట్టు అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ బహుశా మేకోవర్ ఏమైనా చేస్తున్నాడేమో అంటూ తారక్ న్యూ లుక్ ను చూసి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.