ఓ భామ అయ్యో రామ టీజర్.. హీరోయిన్ రక్తచరిత్రలో సుహాస్ అమాయకత్వం

కలర్ ఫొటో తో మంచి గుర్తింపు అందుకున్న టాలెంటెడ్ యువ నటుడు సుహాస్ ప్రతీ కథలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ను టచ్ చేస్తున్నాడు.;

Update: 2025-03-24 09:26 GMT
ఓ భామ అయ్యో రామ టీజర్.. హీరోయిన్ రక్తచరిత్రలో సుహాస్ అమాయకత్వం

కలర్ ఫొటో తో మంచి గుర్తింపు అందుకున్న టాలెంటెడ్ యువ నటుడు సుహాస్ ప్రతీ కథలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ను టచ్ చేస్తున్నాడు. ఇక ఈసారి అతను ఓ భామ అయ్యో రామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాసేపట్లో ప్రేమ.. ఇంకో క్షణంలో మోసం.. వీటి మధ్య సరిగ్గా క్యాచ్ చేసిన కథే ఇది కనిపిస్తోంది. లవ్ స్టోరీల మధ్య జరిగే సీరియస్ పరిణామాలను దర్శకుడు రామ్ కామెడీ ట్రాక్ లో హైలెట్ చేసినట్లు అనిపిస్తోంది.

హీరోయిన్ మొండిగటం, ఇక ఆమె తండ్రి ఇంకా కఠినంగా వంటి అంశాలు హీరో పాత్రను ఇంకా ఇరకాటంలో పెట్టేలా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులను విభిన్నంగా ఆకట్టుకోవాలనే ప్రయత్నం టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. యంగ్ హీరో సుహాస్ మరోసారి కామెడీ, డ్రామా మిక్స్‌ చేసిన ఎంటర్టైనింగ్ రోల్‌తో స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తం డైలాగ్స్‌కే హైలెట్. టీజర్ ప్రారంభంలో కేఫ్‌ లో హీరోయిన్‌ కోసం వెయిట్ చేస్తుండగా ఆమె మరొకరిని చెంప పగలగొట్టడం, అది చూసిన హీరో భయపడడం, ఆ తరువాత డైరెక్ట్ గా "నీకు ప్రపోజ్ చేద్దామనుకున్నా" అనే సమాధానం ఇవ్వడం హైలెట్ అయ్యింది.

ఇవన్నీ కేవలం డైలాగ్స్ రూపంలోనే చూపించి క్యూరియాసిటీని పెంచేశారు. ఇక "ఇతడే నా హస్బెండ్... కాళ్లు లేవు కానీ నాన్నకి నచ్చాడు.. మనదేం బొమ్మరిల్లు కాదు రక్తచరిత్ర" అనే డైలాగ్ కూడా చాలా క్రేజీగా కట్ చేశారు. డైలాగ్స్‌తోనే క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో ఊహించేసేలా టీజర్ ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో కథ గురించిన డైరెక్ట్ హింట్ ఏమీ ఇవ్వలేదు. కానీ హీరోయిన్ అలాగే ఆమె ఫ్యామిలీ పాయింట్ తో ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ గా మలుపులు తీసే కథగా కనిపిస్తోంది.

చివర్లో సుహాస్ చెప్పే “బాబూ… అమ్మాయిలను నమ్మొద్దు బాబూ… అనుభవించి చెబ్తున్నా బాబూ…” అనే డైలాగ్ మరోసారి నవ్వించడమే కాదు, కథలోని ట్విస్టులపై హింట్ ఇచ్చేలా ఉంది. టీజర్ కట్ పూర్తిగా డైలాగ్స్ ఆధారంగా సాగిపోవడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్, విజువల్స్ కూడా బాగానే క్యాచ్ అయ్యాయి. అలాగే మేజర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు టీజర్‌లో కనిపించడంతో క్యాస్టింగ్ వైపు బలంగా ఉందన్న నమ్మకం వస్తోంది.

ఈ సినిమాతో మలయాళ హీరోయిన్ మాళవిక మనోజ్‌ తెలుగు ప్రేక్షకులకి పరిచయం కానుంది. ఆమె లుక్స్‌కు తగ్గట్టుగా పాత్ర ఉండబోతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రామ్ గోదాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హరీష్ నల్ల నిర్మిస్తుండగా, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News