రష్మిక రెక్కల కార్ ఖరీదెంతో తెలుసా?
రష్మిక దాదాపు రూ. 2 కోట్ల విలువైన అద్భుతమైన మెర్సిడెస్-బెంజ్ ఎస్-450ని కొనుగోలు చేసింది.;

ఖరీదైన స్వాంకీ కార్లలో దిగడం కొందరు బాలీవుడ్ స్టార్లకు మాత్రమే సాధ్యం అని భావిస్తాం. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రిన, శ్రద్ధా కపూర్ వంటి స్టార్లు ఖరీదైన హైఎండ్ కార్లలో షికార్ చేయడం తెలిసినదే. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న వారి సరసన చేరింది.

రష్మిక దాదాపు రూ. 2 కోట్ల విలువైన అద్భుతమైన మెర్సిడెస్-బెంజ్ ఎస్-450ని కొనుగోలు చేసింది. సెలబ్రిటీలు తమ రోల్స్ రాయిస్‌లు, లంబోర్గినిలు - మేబ్యాక్ వంటి ఖరీదైన వెర్షన్ లతో మెరుపులు మెరిపిస్తుంటే, రష్మిక కూడా తన యూనిక్ టేస్ట్ ని ప్రెజెంట్ చేస్తోంది. వెటరన్స్ ఖరీదైన హ్యాబిట్స్ తోను పోటీపడటంలో రష్మిక ఎక్కడా తగ్గడం లేదు. తనవద్ద ఇప్పటికే ఐదు ఖరీదైన లగ్జరీ బ్రాండ్ కార్లు గ్యారేజీలో ఉన్నాయి. కేవలం ఈ కార్ల కోసం కోట్లాది రూపాయలను రష్మిక వెచ్చిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే .. రష్మిక మందన్న నటించిన సికందర్ ఈద్ కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించగా, తనకంటే 30 ఏళ్ల తక్కువ వయసున్న కథానాయికతో రొమాన్స్ చేయడం చర్చగా మారింది.