కొత్త సంవత్సరంలో మెగాస్టార్ కొత్త మూవీ షురూ
టాలీవుడ్ లో అపజయమెరగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు.;

టాలీవుడ్ లో అపజయమెరగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనిల్ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేసి లాక్ చేసుకున్నాడు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి మరియు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇవాళ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి మరియు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇవాళ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేష్, నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, నాగవంశీ, మైత్రీ నవీన్, రవి హాజరయ్యారు.
డైరెక్టర్లు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, బాబీ, శ్రీకాంత్ ఓదెల, వశిష్ఠ తో పాటూ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్ ను నిర్మాతలైన సాహు, సుస్మితకు అందించగా, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ కలిసి కెమెరా స్విచ్ఛాన్ చేసి సినిమాను మొదలుపెట్టారు.
ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టి మెగా157ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. పూజా కార్యక్రమాలు అనంతరం హాజరైన గెస్టులంతా మెగా157 టీమ్ తో ఫోటోలు దిగారు. ఈ సినిమాను అనిల్ తనదైన కామెడీ, యాక్షన్ తో రూపొందించినట్టు తెలుస్తోంది. మెగా157లో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించనున్నట్టు అనిల్ రావిపూడి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు.