కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ.. ఎవరో తెలుసా?
సినీ నటి అభినయ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వేగేశ్న కార్తీక్‌తో తనకు మార్చి 9వ తేదీన ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే;

సినీ నటి అభినయ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వేగేశ్న కార్తీక్‌తో తనకు మార్చి 9వ తేదీన ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగిన టైమ్ లో కేవలం తనకు కాబోయే భర్తతో కలిసి గుడిలో దేవుని ముందు గంట కొడుతున్న ఫోటోను మాత్రమే పోస్ట్ చేసిన అభినయ ఇప్పుడు తన భర్తను అందరికీ పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో తమ ఫోటోలను షేర్ చేసింది.

మార్చి 9న తనకు వేగేశ్న కార్తీక్ తో నిశ్చితార్థం జరిగినట్టు తెలుపుతూ అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి కాబోయే భర్తను ప్రపంచానికి పరిచయం చేసింది అభినయ. కార్తీక్ ఆమెకు ఎప్పట్నుంచో ఫ్రెండ్. గత కొంతకాలంగా ప్రేమించుకున్న వారిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. కార్తీన్ ను ఆయన సన్నిహితులు సన్నీ వర్మ అని పిలుస్తుంటారు.
సన్నీకి పలు వ్యాపారాలున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్‌మెన్ గా సన్నీకి పేరుంది. భీమవరంకు చెందిన సన్నీకి తెలుగు రాష్ట్రాల్లో పలు బిజినెస్‌లు ఉన్నాయి. మొన్నటివరకు కాబోయే భర్త ఫేస్ ను సీక్రెట్ గా ఉంచిన అభినయ ఇప్పుడు అతని ఫేస్ ను రివీల్ చేసింది. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన మిగిలిన వివరాలు కూడా తెలిసే అవకాశముంది.
వారి పెళ్లి భీమవరం లేదా చెన్నై లో జరుగుతుందని అభినయ సన్నిహితులు అంటున్నారు. ఎంగేజ్‌మెంట్ విషయంతో పాటూ అభినయ కాబోయే భర్తను కూడా బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడంతో అందరూ అభినయ జంటకు కంగ్రాట్స్ చెప్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తెలుగు సినిమాల్లో పలు పాత్రల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ.
ఆల్రెడీ శంభో శివ శంభో సినిమాలో నటించినప్పటికీ అభినయకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చెల్లిగా నటించిన పాత్ర ద్వారానే అందరికీ బాగా గుర్తుండిపోయింది. అభినయ పుట్టుకతోనే చెవిటి, మూగ అయినప్పటికీ నటిగా మాత్రం ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. గతంలోనే అభినయ తను ప్రేమలో ఉన్న విషయాన్ని మీడియా ముఖంగా బయటపెట్టిన విషయం తెలిసిందే.