'రామ్' రాజు భీమ్ కలయిక ఎప్పుడు..?

సినిమాలో రామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా వారి విశ్వరూపం చూపించారు.;

Update: 2025-03-27 05:31 GMT
Ntr Ram charan team up friendship

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి RRR సినిమా చేశారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో సంచలనాలు సృష్టించింది. సినిమాలో రామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా వారి విశ్వరూపం చూపించారు.

రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్ గా RRR సూపర్ సెన్సేషనల్ గా ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో వరల్డ్ సినీ లవర్స్ ని ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్, చరణ్ ఫ్రెండ్ షిప్ మరింత స్ట్రాంగ్ అయ్యింది.

ఇప్పుడు కాదు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు సీసీఎల్ ఏర్పడక ముందు జరిగిన టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ లో చాలా క్లోజ్ గా కనిపించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ బర్త్ డే కి చరణ్, చరణ్ బర్త్ డే కి ఎన్టీఆర్ ఇలా నైట్ పార్టీలు చేసుకునే వారు.

ఈ విషయాలన్నీ ఫ్యాన్స్ కి తెలియకుండా చాలా సీక్రెట్ గా ఉంచారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఐతే ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్రం అంత సఖ్యత లేదు. RRR సినిమా టైం లో అది పీక్స్ కి చేరింది. సినిమాలో పాత్రల స్క్రీన్ టైంతో పాటు హీరో, సైడ్ రోల్ అంటూ ఫ్యాన్స్ చేసిన సోషల్ మీడియా వార్ తెలిసిందే.

సినిమా సినిమాకు ఈ వార్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఇక RRR తర్వాత ఎన్టీఆర్, రాం చరణ్ అసలు కలిసి కనిపించింది లేదు. ఆ సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏదో బర్త్ డే లకు విష్ చేసుకోవడం లాంటివి తప్ప పెద్దగా పార్టీలు కూడా చేసుకున్నట్టు లేదు. అప్పుడెప్పుడో ఇద్దరు అనుకోకుండా బేగంపేట ఎయిర్ పోర్ట్ లో కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారంతే. మరి ఫ్యాన్స్ మధ్య దూరం వాళ్ల మధ్య కూడా పెంచేలా చేసిందా అన్న డౌట్ కూడా రేజ్ అవుతుంది.

సినిమాలతో సాటి స్టార్స్ తో పోటీ పడతారు కానీ బయట మాత్రం వాళ్లంతా చాలా క్లోజ్ గా ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రాం చరణ్ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. వాళ్ల ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ఫైట్ ఉన్నా వాళ్లు మాత్రం అవేవి పట్టించుకోరు.. ఈ క్రమంలోనే నేడు రామ్ చరణ్ బర్త్ డే కి ఎన్టీఆర్ స్పెషల్ విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ అంటూ రాం చరణ్ కి తారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

రామ్ చరణ్ బర్త్ డే కాబట్టి ఎన్టీఆర్ పార్టీలో పాల్గొంటాడా అలా కలిసి పార్టీలో కనిపిస్తే మాత్రం వాళ్ల మధ్య దూరం అన్నది గాలి వార్తలే తప్ప వాళ్లు మాత్రం ఒక మంచి స్ట్రాంగ్ ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తున్నట్టుగా వెల్లడించే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News