బంపరాఫర్ కొట్టేసిన కోర్టు నటుడు
ముందుగానే వారిని లాక్ చేసుకుంటే ఆల్రెడీ వారి హైప్ ను కూడా క్యాష్ చేసుకోవచ్చనే యాంగిల్ లో కూడా నిర్మాతలు ఆలోచిస్తుంటారు.;

ఏదైనా కొత్త సినిమా రిలీజై అందులో ఫలానా క్యారెక్టర్ లో ఫలానా నటి లేదా నటుడు భలే యాక్ట్ చేశారు అనే పేరు బయటకు రావడం ఆలస్యం నిర్మాతలు వారిని సంప్రదించి వెంటనే వారికి సంబంధించిన డేట్స్ ను లాక్ చేసుకుంటూ ఉంటారు. ముందుగానే వారిని లాక్ చేసుకుంటే ఆల్రెడీ వారి హైప్ ను కూడా క్యాష్ చేసుకోవచ్చనే యాంగిల్ లో కూడా నిర్మాతలు ఆలోచిస్తుంటారు.
రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు సినిమాలో ఎంతో గొప్ప నటనను కనబరిచిన హర్ష్ రోషన్ ఆ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. రోషన్ నటించిన కోర్టు సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే.
కోర్టు సినిమా కమర్షియల్ పరంగా కూడా సక్సెస్ అవడంతో దిల్ రాజు హర్ష్ రోషన్ ను సంప్రదించి అతనితో డీల్ కుదుర్చుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 20 ఏళ్ల కిందట జరిగిన ఓ పీరియాడికల్ లవ్ స్టోరీని దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తోంది.
ఆ సినిమా కోసమే దిల్ రాజు హర్ష్ రోషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని అంటున్నారు. ఆల్రెడీ కోర్టు సినిమాను నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా దిల్ రాజు, హర్ష్ మధ్య ఏర్పడిన పరిచయంతో దిల్ రాజు రోషన్‌తో ఈ సినిమాను సెట్ చేశాడని అంటున్నారు. తెల్ల కాగితం అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాతో రమేష్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో అరుణాచల్ క్రియేషన్స్ లో కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాను నిర్మించనున్నారని, సమ్మర్ నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.