పిక్‌టాక్ : దంగల్ బ్యూటీ స్టైలిష్ కవర్ ఫోజ్
తాజాగా ఈమె HT సిటీ షోస్టాపర్స్ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా అందమైన స్టిల్స్‌కు ఫోజ్ ఇచ్చింది. కవర్ ఫోటో మాదిరిగా ఫాతిమా స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;

బాల నటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఫాతిమా సనా షేక్ హీరోయిన్‌గానూ ఆకట్టుకుంది. సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన దంగల్ సినిమాలో ఆయన కూతురుగా నటించడం ద్వారా ఒక్కసారిగా బాలీవుడ్‌లో గుర్తింపు దక్కించుకున్న ఫాతిమా సనా షేక్ బిజీ హీరోయిన్‌గా మారింది. దంగల్ సినిమాలో ఆమీర్ ఖాన్ కూతురు పాత్రలో నటించిన ఫాతిమా ఆ వెంటనే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో ఆమీర్ ఖాన్‌కి జోడీగా నటించిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో చిన్న హీరోల సినిమాలతో పాటు, స్టార్ హీరోల సినిమాల్లోనూ కనిపిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్స్ జాబితాలో చేరి అందరిని సర్‌ప్రైజ్ చేసింది.

గత ఏడాది కొన్ని కారణాల వల్ల ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ ఈ ఏడాది ఈమె నటించిన సినిమాలు మూడు నుంచి ఐదు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. బాలీవుడ్‌తో పాటు అవకాశాలు వస్తే, పాత్రకు ప్రాముఖ్యత ఉంటే కచ్చితంగా సౌత్ సినిమాల్లోనూ నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్ చేసే ఫాతిమా మరోసారి కవర్ ఫోటో స్టిల్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 3.3 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఫాతిమా ఏ ఫోటోలు షేర్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా ఈమె HT సిటీ షోస్టాపర్స్ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా అందమైన స్టిల్స్‌కు ఫోజ్ ఇచ్చింది. కవర్ ఫోటో మాదిరిగా ఫాతిమా స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె ప్రమోషన్‌తో HT సిటీ షోస్టాపర్స్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరుగుతుంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా ఫోటోలను షేర్ చేసిన HT సిటీ షోస్టాపర్స్ పోస్ట్‌కి మంచి స్పందన దక్కింది. ఫాతిమా సనా షేక్ అందమైన ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, ఆ బ్రాండ్ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగేలా చేసింది. తన అందంతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉండే ఫాతిమా ఆ మధ్య ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది.
సీనియర్ హీరోతో ఈమె ప్రేమ వ్యవహారం అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ సమయంలో ఫాతిమా మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోను అంటూ తేల్చి చెప్పింది. అంతే కాకుండా తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, తాను సింగిల్‌గానే చాలా సంతోషంగా ఉంటానని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన పద్దతికి, తన లైఫ్ స్టైల్, వర్కింగ్ స్టైల్‌కి పెళ్లి అనేది అడ్డు వస్తుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దంగల్ సినిమా తర్వాత బిజీ అయిన ఫాతిమా ఈ ఏడాదిలో మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.