సాహో శ్ర‌ద్ధ కొత్త కార్ ధ‌ర నోరెళ్ల‌బెట్టాల్సిందే

2025 శ్ర‌ద్ధాకు అన్నివిధాలా క‌లిసి వ‌స్తోంది. ఇప్పుడు ఉగాది ఫ‌ర్వ‌దినాన మ‌రో శుభ‌వార్త‌ను తెచ్చింది.;

Update: 2025-03-30 12:30 GMT
Shraddha Kapoors New Luxury Car

2025 శ్ర‌ద్ధాకు అన్నివిధాలా క‌లిసి వ‌స్తోంది. ఇప్పుడు ఉగాది ఫ‌ర్వ‌దినాన మ‌రో శుభ‌వార్త‌ను తెచ్చింది. ఈ ఏడాది `స్త్రీ 2` గ్రాండ్ స‌క్సెస్ తో శ్ర‌ద్ధా క‌పూర్ త‌న కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాధిస్తోంది. ఇటీవ‌లి కాలంలోని బిగ్గెస్ట్ హిట్ చిత్రాల‌లో పుష్ప 2, చావా త‌ర్వాత స్త్రీ 2 పేరు మార్మోగుతోంది. ఇదే స‌మ‌యంలో శ్ర‌ద్ధా ఆచితూచి కెరీర్ ఎంపిక‌ల్ని సాగిస్తోంది. ఓవైపు ప్ర‌ముఖ ర‌చ‌యిత‌తో శ్ర‌ద్ధా డేటింగ్ పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఇంత‌లోనే శ్ర‌ద్ధా కార్ గ్యారేజీలో ఖ‌రీదైన కొత్త కార్ చేరింది. ఈ కార్ రేంజ్ ధ‌ర‌ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిగ్గా మారాయి.

శ్రద్ధా కపూర్ తన కార్ కలెక్షన్‌లో గ్రాఫైట్ బ్లాక్ లెక్సస్ ఎల్‌.ఎం అల్ట్రా లగ్జరీ కారును జోడించింది. ఈ స్టైలిష్ కార్‌లో ముంబై అంతటా షికార్ చేస్తూ కనిపించింది. ఇప్పటికే లంబోర్గిని హురాకాన్ టెక్నికాకు గ‌ర్వ‌కార‌ణ‌మైన య‌జ‌మాని. దీనిని 2023లో రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ లగ్జరీ కార్లకు రూ. 2.93 కోట్ల ఖ‌రీదైన లెక్స‌స్ కార్ ని జ‌త చేసింది. కొత్త కార్ లో శ్ర‌ద్ధా ఎంతో ఉల్లాసంగా కనిపించింది. లెక్సస్ లో రిక్లైనింగ్ సీట్లు, 48-అంగుళాల వైడ్ స్క్రీన్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, ఫ్రిజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ లగ్జరీ వాహనం బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్ - రణబీర్ కపూర్ వంటి స్టార్ల‌కు కూడా ఉంది. శ్రద్ధా కొత్త కారులో ప్రయాణిస్తున్న వీడియోను ఫోటోగ్రాఫ‌ర్లు షేర్ చేయ‌గా, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఉగాది రోజు శ్ర‌ద్ధా కొత్త కార్‌లో షికార్ చేయ‌డం బావుంద‌ని ప్ర‌శంసిస్తున్నారు.

శ్రద్ధా కపూర్ ఎరుపు రంగు లంబోర్గిని హురాకాన్ కార్‌లో శ్ర‌ద్ధా కుటుంబం ముంబైలో తిరుగుతూ కనిపిస్తారు. శ్ర‌ద్ధా కేవ‌లం కార్ల‌ను కొన‌డంలోనే కాదు.. రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డంలోను స్పీడ్ గా ఉంది. ముంబైలోని పిరమల్ మహాలక్ష్మి సౌత్ టవర్‌లో శ్ర‌ద్ధాకు ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కూడా ఉంది. దీని ఖ‌రీదు సుమారు 7 కోట్లు. శ్రద్ధా కపూర్ జీవితంలో ఆర్థికంగా బాగా సెటిలైంది. కానీ పెళ్లెప్పుడు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ఇటీవ‌ల స్క్రీన్ రైటర్ రాహుల్ మోడీతో బహిరంగంగా వెకేష‌న్స్ కి వెళుతూ శ్ర‌ద్ధా వార్తల్లో నిలుస్తోంది. వారు తమ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించక‌పోయినా.. కలిసి కనిపించడం డేటింగ్ ఊహాగానాలకు దారితీస్తోంది.

Tags:    

Similar News