పాన్ ఇండియా స్టార్ల మధ్య ఇకపై ప్రళయమే!
ఎస్ ఎస్ ఎంబీ 29తో సూపర్ స్టార్ మహేష్ కూడా ఆ నలుగురు సరసన చేరబోతున్నాడు. భవిష్యత్ లో మరింత మంది పాన్ ఇండియా స్టార్లగా మారుతారు.;
ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ పాన్ ఇండియా మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టించారు. `బాహుబలి`తో ప్రభాస్, 'ఆర్ ఆర్ ఆర్' తో తారక్, చరణ్, 'పుష్ప'తో బన్నీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా ఏంటన్నది? ప్రూవ్ చేసారు. ప్రస్తుతానికి ఈ నులుగురే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాలో దుమ్ము రేపే హీరోలు. బన్నీ మినహా ముగ్గుర్ని పాన్ ఇండియా స్టార్లు చేసింది రాజమౌళి. బన్నీని మాత్రం సుకుమార్ వాళ్ల సరసన నిలబెట్టాడు.
ఎస్ ఎస్ ఎంబీ 29తో సూపర్ స్టార్ మహేష్ కూడా ఆ నలుగురు సరసన చేరబోతున్నాడు. భవిష్యత్ లో మరింత మంది పాన్ ఇండియా స్టార్లగా మారుతారు. అంతవరకూ ఈ నలుగురైదుగురి మధ్య పాన్ ఇండియాలో తీవ్రమైన పోటీ ఉంటుంది? అన్నది అంతే వాస్తవం. ఇప్పటి వరకూ వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. కాబట్టి మార్కెట్ పరంగా పోటీ ఎక్కడా తలెత్తలేదు.
కానీ ఇకపై సన్నివేశం అలా ఉండదు. ఒకేసారి ఆ నలుగురు పాన్ ఇండియాలో బాక్సాఫీస్ బరిలోకి దిగితే పెద్ద ప్రళయమే తలెత్తుతుంది. ఆ స్టార్ హీరోలతో సినిమాలంటే నిర్మాతలు వందల కోట్లు పెడుతున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రాజీ పడే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేయాలి కాబట్టి! భవిష్యత్ లో రిలీజ్ తేదీల విషయంలో ఏ హీరో కూడా రాజీ పడే పరిస్థితి ఉండదు.
అలా రాజీ పడితే నిర్మాతకు నష్టాలు తప్పవు. హీరోలు కూడా పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా రూపంలో అందుకునే ప్రక్రియ మొదలైతే? వాళ్లు కూడా నిర్మాతకు సలహాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలో హీరోల మధ్య పోటీ మొదలైంది. ఓటీటీలు ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తాము ఇచ్చిన తేదీల్లో స్ట్రీమింగ్ అవుతుంది తప్ప! నిర్మాత...హీరో చెప్పినట్లు అక్కడ నడవదని కరాఖండీగా చెప్పేస్తున్నారు.
ఓటీటీ రిలీజ్ లు అన్నవి ఇప్పుడు ఓ ఆర్డర్ ప్రకారం జరుగుతున్నాయి. ఇక్కడ చిన్న సినిమా -పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేదు. అలా చేయకపోతే ఓటీటీలు నష్టపోతాయి. ఓటీటీ రిలీజ్ మధ్య పోటీనే ప్రామాణికంగా తీసుకుంటే? భవిష్యత్ లో థియేట్రికల్ రిలీజ్ మధ్య తీవ్రమైన పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.