బాక్సాఫీస్.. ఊపిరి పీల్చుకో!

సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అనుకున్నంత సందడి లేదు. మామూలుగానే సంక్రాంతి వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ డల్ అవుతుంటుంది;

Update: 2025-03-24 09:19 GMT

సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అనుకున్నంత సందడి లేదు. మామూలుగానే సంక్రాంతి వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ డల్ అవుతుంటుంది. ఈసారి మరింత స్లంప్ కనిపించింది. రెండు నెలల వ్యవధిలో తెలుగు నుంచి వచ్చిన హిట్లు రెండు మాత్రమే. అవే.. తండేల్, కోర్ట్. తమిళ అనువాదం ‘రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్’ కూడా బాగానే ఆడింది. మిగతా చిత్రాలన్నీ నిరాశపరిచాయి.

ప్రతి వారం పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజవుతూ వచ్చినా.. వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినవి తక్కువే. సరైన ఆక్యుపెన్సీలు లేక ఈ రెండు నెలల్లో థియేటర్లను నడపడం చాలా కష్టమైంది. ఐతే వచ్చే వీకెండ్‌తో పరిస్థితి మారబోతోంది. రంజాన్ వీకెండ్లో బాక్సాఫీస్ మోత మోగేలా కనిపిస్తోంది. వివిధ భాషల్లో క్రేజీ మూవీస్ వస్తుండడంతో దేశవ్యాప్తంగా థియేటర్లు కళకళలాడబోతున్నాయి.

తెలుగులో రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ రూపంలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్లు రిలీజవుతున్నాయి. ఈ సినిమాల ప్రోమోలతో పాటు.. టీం సభ్యులు చేసిన ప్రమోషనల్ వీడియోలు సైతం వినోదాత్మకంగా సాగి తమ చిత్రాల్లో బోలెడంత ఎంటర్టైన్మెంట్‌ ఉంటుందనే సంకేతాలు ఇచ్చాయి. రెంటికీ ఫుల్ పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. దేన్నీ తక్కువ చేసే పరిస్థితి లేదు. పరీక్షలు పూర్తి చేసుకుంటున్న యూత్.. ఈ సినిమాల కోసం ఎగబడడం ఖాయం.

మరోవైపు మలయాళం నుంచి ‘ఎల్-2: ఎంపురాన్’, తమిళం నుంచి ‘వీర ధీర శూర’ కూడా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. రెండూ తెలుగు ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్లే అని ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. గురువారమే ఈ రెండు చిత్రాలు రిలీజవుతుండగా.. తర్వాతి రోజు రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సందడి చేయనున్నాయి. మరోవైపు సల్మాన్ ఖాన్ హిందీ సినిమా ‘సికందర్’ ఆదివారం రిలీజవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్‌లో సల్మాన్ సినిమాలకు బాగానే డిమాండ్ ఉంటుంది. పైగా ఆ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక, మురుగదాస్ డైరెక్ట్ చేశాడు. కాబట్టి దీనికీ మంచి ఓపెనింగ్సే రావచ్చు. మొత్తంగా చూస్తే వచ్చే వీకెండ్లో బాక్సాఫీస్ కళకళలాడడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News