అఖిల్.. ఆ కథ ఈ కథ ఒక్కటి కాదు!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తక్కువ సినిమాలు చేసినా, విభిన్నమైన కథల ఎంపికతో కొత్త దిశలో ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నాడు.;

Update: 2025-03-24 08:58 GMT

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తక్కువ సినిమాలు చేసినా, విభిన్నమైన కథల ఎంపికతో కొత్త దిశలో ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ‘ఏజెంట్’ ఫెయిల్యూర్ తర్వాత ఒకింత గ్యాప్ తీసుకున్న అఖిల్, ఇకపై కథల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడి వద్ద మూడు నాలుగు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇప్పటికే మురళీ కిషోర్ అబ్బూరితో కలిసి లెనిన్ అనే టైటిల్‌తో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ చేయడానికి గ్రీమ్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇంకా అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు. కానీ దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో అఖిల్ పాత్ర పూర్తిగా న్యూ డైమెన్షన్‌తో ఉంటుందని సమాచారం.

UV క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపిస్తుండగా, అక్కినేని నాగార్జున కూడా దీనిపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో, మరో కొత్త కథతో దర్శకుడు నందు అఖిల్‌ను కలిశాడట. నందు గతంలో వెంకటేష్‌కు ఓ కథ చెప్పగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ తర్వాత వెంకీ ఆ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గాడు.

అయితే నందు ఆ కథనే అఖిల్ కు చెప్పినట్లు టాక్ వచ్చింది. కానీ అతను చెప్పింది ఆ కథ కాదని తెలుస్తోంది. నందు ఇప్పుడు అఖిల్‌కు వేరే కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా పొందినట్టు టాక్. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు UV క్రియేషన్స్ బ్యానర్‌లో మరో సినిమా చేయాలనే ప్రణాళిక ఉంది. కానీ అది ఇంకా పూర్తిగా లాక్ కాలేదు.

అలాగే అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి మరో సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రాజెక్ట్స్‌లో ఏది ముందుగా మొదలవుతుందా, లేక నందు కథే ఫస్ట్ అవుతుందా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సమీకరణాలన్నింటిని చూస్తే అఖిల్ ఇప్పుడు కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. మరి రాబోయే ఈ కాంబినేషన్స్ అతనికి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

Tags:    

Similar News