చరణ్ మెగాఫ్యాన్స్ ని నిరుత్సాహ పరచడుగా!
ఆర్సీ 16 ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ సహా ప్రధాన తారాగాణంపై బుచ్చిబాబు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.;
ఆర్సీ 16 ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ సహా ప్రధాన తారాగాణంపై బుచ్చిబాబు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని సన్నివేశాలు ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరిస్తుంటే ..మరికొన్నింటిని ఔట్ డోర్ లోనూ పూర్తి చేసే పనలో ఉన్నాడు. ఇటీవలే ఢిల్లీలోనూ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనూ షూటింగ్ జరుగుతోంది.
అయితే ఈ సినిమా మొదలైన నాటి నుంచి ఇంతవరకూ మళ్లీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. సంగీత దర్శకుడు రెహమాన్ మాత్రం అందిరిపోయే బాణీలు అందిస్తున్నట్లు బుచ్చిబాబు చాలా సందర్భాల్లో చెప్పాడు. సినిమాకి సంగీతం ప్రాణంలా నిలుస్తుందని....రెమహమాన్ ఈజ్ బ్యాక్ అనిపించేలా బాణీ లుంటాయన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ నుంచి ఓ లీక్ అందింది.
ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ రెడీ అయిందిట. కట్ తో పాటు గ్లింప్స్ సిద్దంగా ఉందని అంటున్నారు. కానీ ఆ గ్లింప్స్ కి రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సి ఉందిట. నిన్నటి వరకూ నైట్ షూట్ జరిగింది. నేటి నుంచి మేకర్స్ గ్లింప్స్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి రెహమాన్ రెండు రోజుల్లే ఆస్కోర్ పూర్తి చేయాలి. లేదంటే మెగా అభిమానులు నిరుత్సాహపడతారు.
ఎందుకంటే చరణ్ బర్త్ డే మార్చి 27. ఆ రోజున గ్లింప్స్ రిలీజ్ చేయాలన్నది బుచ్చిబాబు ప్లాన్. అభిమా నులు కూడా గ్లింప్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అది రెహమాన్ చేతుల్లోనే ఉంది. రెహమాన్ తో పనంటే? ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇన్ టైమ్ కి ఔట్ పుట్ ఇవ్వరు? అన్న విమర్శ ఆయనపై చాలా కాలంగానే ఉంది. కొమ్ములు తిరిగిన డైరెక్టర్లే రెహమాన్ నుంచి తీసుకోలే కపోయారు. మరి బుచ్చిబాబుకు సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాలి.