పిక్‌టాక్‌ : అందాల నభా శిల్పం

ఆ సినిమాల తర్వాత నభా ఎంపిక చేసుకున్న సినిమాల వల్ల కెరీర్‌లో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వచ్చింది.;

Update: 2025-03-25 15:01 GMT

కన్నడ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నభా నటేష్‌ టాలీవుడ్‌లో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమాలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఆ సినిమాతో దక్కిన గుర్తింపుతో టాలీవుడ్‌లో వరుస సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంది. 2019లో ఇస్మార్ట్‌ శంకర్ సినిమాలో నటించి సూపర్‌ హిట్‌ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో నభా నటేష్ యాక్టింగ్‌, డైలాగ్‌ డెలివరీ అన్నింటికి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ సినిమా సక్సెస్‌ను నభా సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలం అయింది. ఆ సినిమాల తర్వాత నభా ఎంపిక చేసుకున్న సినిమాల వల్ల కెరీర్‌లో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వచ్చింది.


నితిన్‌ హీరోగా నటించిన మాస్ట్రో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్‌ సినిమాల తర్వాత నభా నటేష్ పెద్దగా ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. గత ఏడాది డార్లింగ్‌ అనే వెబ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి ఆ సినిమాలోనూ మంచి నటనతో ఆకట్టుకుంది. అయినా కూడా సినిమాల్లో ఈమెకు ఆఫర్లు దక్కడం లేదు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇన్‌స్టా ఫోటో షూట్స్‌తో ఎప్పుడూ వైరల్‌ అవుతూ ఉండే నభా నటేష్ మరోసారి తన అందమైన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.


క్వీన్‌ ఆఫ్ యువర్‌ హార్ట్ అంటూ లవ్ ఈమోజీని షేర్‌ చేసిన నభా నటేష్ తన అందంతో చూపు తిప్పనివ్వడం లేదు. అందాల శిల్పం మాదిరిగా కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌తో, గ్లామర్ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న నభా నటేష్ మరోసారి ఈ ఫోటోలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. నడుము అందంను చూపిస్తూ నభా ఇచ్చిన ఈ ఫోజ్‌ అందమైన శిల్పంను గుర్తు చేస్తుందని, ఎల్లోర శిల్పం తరహాలో నభా నటేష్ అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న నభా నటేష్‌కి ఇండస్ట్రీలో ఆఫర్లు ఎందుకు రావడం లేదంటూ పలువురు షాక్ అవుతున్నారు.


2015లో కన్నడ చిత్రం వజ్రకాయతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కన్నడంలో వరుసగా లీ, సాహెబా సినిమాల్లో నటించింది. మూడు సినిమాల్లో నటించిన తర్వాత తెలుగు నుంచి ఈమెకు ఆఫర్‌ దక్కింది. సుధీర్‌బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఈమెకు అదుగో సినిమాలోనూ ఆఫర్‌ దక్కింది. 2018 నుంచి వరుసగా తెలుగు ప్రాజెక్ట్‌లను చేస్తూ వస్తుంది. ఆ మధ్య కాలంలో కాస్త గ్యాప్‌ ఇచ్చిన నభా నటేష్ మళ్లీ హీరోయిన్‌గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. త్వరలోనే ఈమెకు ఆఫర్లు దక్కుతాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News