ఇదేం ట్విస్ట్ భయ్యా..దింపేసావుగా!
ఎంపురాన్ రిలీజ్ రోజునే మరో రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కు ఉన్నా? ఎంపురాన్ పై బజ్ పీక్స్ కు చేరుతుంది.;
కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎంపురాన్ ఎల్-2' పై టాలీవుడ్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించడం....దిల్ రాజు చిత్రాన్ని తెలుగు లో రిలీజ్ చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపురాన్ రిలీజ్ రోజునే మరో రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కు ఉన్నా? ఎంపురాన్ పై బజ్ పీక్స్ కు చేరుతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ మరో ట్విస్ట్ రివీల్ చేసారు. తాజాగా సినిమాకి సంబంధించి ఓ షాడో పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇప్పుడా పోస్టర్ నెట్టింట పెను ప్రకంపనలే రేపుతుంది. ఆ పోస్టర్ లో ఉన్న బిగ్ స్టార్ ఎవరో తెలియక నెటి జనులు బుర్ర పీక్కుంటున్నారు. అమీర్ ఖాన్ అని ఒకరు అనగా హాలీవుడ్ నటుడు రిక్ యూన్ అని మరికొంత మంది డిస్కస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద డిబేట్ నడుస్తోంది.
ఓ నెటి జనుడు అతడు అచ్చం అమీర్ ఖాన్ లా ఉన్నాడు. కావాలంటే అతడు చెవులు...ఎత్తు... హెయిర్ స్టైల్ చూడండి అంటూ హింట్ ఇచ్చాడు. బ్యాక్ ఫోజులో చూస్తే అచ్చంగా అమీర్ ఖాన్ లాగే ఉన్నాడు. కానీ ఖరారు చేసుకోలేని పరిస్థితి. అమీర్ ఖాన్ సోదరి కూడా చిత్రంలో నటిస్తోంది. దీంతో అతడు కచ్చితంగా అమీర్ ఖాన్ అనే అంటున్నారు. అంతే బలంగా అతడు హాలీవుడ్ నటుడు అని మరో వర్గం వాదిస్తోంది.
దీంతో ఆ పోస్టర్ లో ఉన్నది ఎవరు? అన్నది పెద్ద చర్చగా మారింది. రిలీజ్ కి మూడు రోజుల ముందు ఈ ట్విస్ట్ తో అంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. రిలీజ్ వరకూ ఎలాగూ ఆ ట్విస్ట్ రివీల్ చేయదు యనిట్. కాబట్టి అప్పటి వరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.