RC16 షూటింగ్ లేటెస్ట్ అప్డేట్

చ‌ర‌ణ్ కెరీర్లో 16వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉండ‌గా, ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బుచ్చిబాబు సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.;

Update: 2025-03-25 13:22 GMT

గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామ గా రూపొందుతున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. చ‌ర‌ణ్ కెరీర్లో 16వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉండ‌గా, ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బుచ్చిబాబు సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఆర్సీ16కు సంబంధించిన హైద‌రాబాద్ షెడ్యూల్ రీసెంట్ గా పూర్తైంది. ఈ కీల‌క షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ తో పాటూ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న జ‌గ‌ప‌తి బాబు, క‌న్న‌డ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. సినిమాలో ఈ షెడ్యూల్ కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ వ‌ర్గాలు చెప్తున్నాయి.

ఇప్ప‌టికే హైద‌రాబాద్ లోరెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఆర్సీ16 మూవీ తదుప‌రి షెడ్యూల్ కోసం ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జుమా మ‌సీదుతో పాటూ మ‌రికొన్ని ప్ర‌దేశాల్లో సినిమాలోని కీల‌క సీన్స్ ను తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లోనే త‌ర్వాతి షెడ్యూల్ కు సంబంధించిన మిగిలిన వివ‌రాలు తెలిసే అవ‌కాశముంది.

జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రాండ్ గా అనౌన్స్ చేయ‌డానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్ క‌ట్ కూడా అయింద‌ని, నెక్ట్స్ లెవెల్ లో ఉంద‌ని అంటున్నారు. సినిమాలో చ‌ర‌ణ్ ఎలా క‌నిపిస్తాడా? అతని లుక్ ఎలా ఉంటుందా అని చూడ్డానికి మెగా ఫ్యాన్స్ తో పాటూ అందరూ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు ముందు నుంచి పెద్ది అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నార‌ని టాక్స్ వినిపించాయి మ‌రి అందులో నిజ‌మెంతో చూడాలి. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్ పై వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తుండ‌గా, మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు స‌మ‌ర్పిస్తున్నాయి.

Tags:    

Similar News