బాలయ్య కూడా దాపరికం చేస్తున్నాడా?
నటసింహ బాలకృష్ణ ఓపెన్ బుక్ టైప్. మనసులో ఏ విషయం ఉంటే ఆ సంగతి వెంటనే బయటకు వచ్చేస్తుంది.;
నటసింహ బాలకృష్ణ ఓపెన్ బుక్ టైప్. మనసులో ఏ విషయం ఉంటే ఆ సంగతి వెంటనే బయటకు వచ్చేస్తుంది. అది విమర్శ అయినా..పొగడ్త అయినా...కోపమైనా సరే తన్నుకుంటూ బయటకు రావాల్సిందే. వ్యక్తిగత విషయాలు కూడా అంతే ఓపెన్ గా పంచుకుంటారు. ఇక సినిమా విషయాలు గురించైతే చెప్పాల్సి న పనిలేదు. అన్ని విషయాలు దాచకుండా చెప్పేసిన బాలయ్య సినిమాల గురించి ఎందకు దాస్తారు? అదీ ఓపెన్ కదా? అయితే ఇదంతా మొన్నటి వరకూ.
ఈ మధ్య బాలయ్య కూడా దాపరికం మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. నటసింహ ఓ సినిమాలో ఆన్ సెట్స్ లో ఉండగానే మరో ప్రాజెక్ట్ పై చర్చలు జరపడం..వాటి వివరాలు అనధికారికంగా రిలీజ్ చేయడం వంటివి చేస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది.
మరో నాలుగైదు నెలల్లో రిలీజ్ కూడా ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత వరకూ బాలయ్య తదుపరి సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఆయన గోపీచంద్ మలినేని... హరీష్ శంకర్ లు లైన్ లో కి తెచ్చినట్లు వార్తలొస్తున్నాయి. గోపీ కంటే ముందుగా హరీష్ శంకర్ తోనే సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారట.
'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యమవ్వడంతో హరీష్ బాలయ్యని లైన్ లోకి తెచ్చి ఆయన ఇమేజ్ కితగ్గ మాస్ స్టోరీ వినిపించి ఒకే చేయించుకున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కుమార్తె తేజస్వీని నిర్మించడానికి ముందుకొచ్చారట. ప్రాజెక్ట్ లాక్ అయిందంటున్నారు. కానీ ఈ విషయాన్ని బాలయ్య మాత్రం గోప్యంగానే ఉంచారు.