బెట్టింగ్ తప్పే.. విచారణ అనంతరం శ్యామల కీలక ప్రకటన

బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రోత్సహించారు, ఎంత మొత్తం పారితోషికం తీసుకున్నారు అనే విషయాలపై పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం;

Update: 2025-03-24 08:02 GMT

బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రోత్సహించారు, ఎంత మొత్తం పారితోషికం తీసుకున్నారు అనే విషయాలపై పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం.

ఈ కేసులో మంగళవారం విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు మరోసారి విచారించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటివరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు లోతుగా విచారించారు. సన్నీ, అజయ్, సుధీర్ కూడా త్వరలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, హర్ష సాయి, ఇమ్రాన్ మాత్రం ఇంకా పోలీసులకు అందుబాటులో లేరు.

మరోవైపు మియాపూర్ కేసులో పోలీసులు మొదట బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు, మధ్యవర్తులపై దృష్టి సారించినట్టు సమాచారం.. ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ గతంలో ఒకసారి యాప్‌ను ప్రోత్సహించినప్పటికీ, ఆ తర్వాత దానితో సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, నటుడు విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్‌ల విషయంలో తాను చాలా స్పష్టతతో వ్యవహరించానని వివరించారు.

ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ శ్యామలను కూడా పోలీసులు విచారించారు. యాంకర్ శ్యామల ఈ కేసులో నేడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‍కు విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి ఉదయం 8:44 గంటలకు పోలీస్ స్టేషన్‍కు చేరుకున్న శ్యామల స్టేట్మెంట్‍ను రికార్డ్ చేశారు. దాదాపు మూడున్నర గంటలుగా పోలీసులు శ్యామలను ప్రశ్నించారు. ఈ కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్న పోలీసులు, శ్యామల నుండి పూర్తి వివరాలను సేకరించినట్టు సమాచారం.

విచారణ అనంతరం యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం విచారణ జరుగుతోంది. డెసిషన్ కోర్టులో ఉంది.ఇప్పుడు మాట్లాడితే అది కోర్టు ఉల్లంఘన అవుతుంది. బెట్టింగ్ యాప్ లపై విచారణకు తాను పూర్తిగా సహకరిస్తాను. చట్టాల మీద, న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉంది. బెట్టింగ్ నిర్వాహకులను పట్టుకోవడంలో నా సహకారం పోలీసులకు ఎప్పుడూ ఉంటుంది’ అని యాంకర్ శ్యామల అన్నారు..

‘బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు. దీనివల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆ లోటు తీర్చలేనిది. ఇక ముందు ఇలాంటివి జరుగకుండా నాతో సహా అందరిపై ఉంది’ అని యాంకర్ శ్యామల కోరారు.

Full View
Tags:    

Similar News