OTT అవార్డుల్లో రానా- కాజోల్- షాలిని మెరుపులు

శనివారం రాత్రి OTTplay తన మూడవ ఎడిషన్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.;

Update: 2025-03-23 08:58 GMT

క‌రోనా క్రైసిస్ త‌ర్వాత ఓటీటీ రంగం దూకుడుకు ముకుతాడు వేయ‌డం ఎవ‌రి వ‌ల్లా కాలేదు. అమీర్ ఖాన్ లాంటి అగ్ర హీరో ఓటీటీల‌తో ముప్పు గురించి తీవ్రంగా క‌ల‌త‌కు గుర‌య్యారు. థియేట‌ర్లు అట‌కెక్క‌డం ఖాయ‌మ‌ని ఆవేద‌న చెందారు. చాలా మంది అగ్ర నిర్మాతలు ఓటీటీల డ్యూయ‌ల్ గేమ్ విష‌యంలో తీవ్ర‌ ఆందోళ‌న‌లో ఉన్నారు. ఓటీటీల్ని నియంత్రించ‌క‌పోతే థియేట్రిక‌ల్ రంగం మ‌నుగ‌డ క‌ష్ట‌మేన‌ని, సినీ ప‌రిశ్ర‌మ‌లు ఊగిస‌లాడుతాయ‌ని కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఓటీటీల హవాకు ఎదురులేద‌ని నిరూపిస్తూ, అవార్డుల‌తోను హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

OTT రంగంలో భారతీయ సినిమాలు, సిరీస్‌లకు అవార్డులు అందించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. తాజాగా ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 విజేతలలో మనోజ్ బాజ్‌పేయి, అవినాష్ తివారీ, కాజోల్ వంటి ప్ర‌ముఖుల హ‌వా సాగింది.

శనివారం రాత్రి OTTplay తన మూడవ ఎడిషన్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. వినోద రంగంలోని అన్ని భారతీయ ప‌రిశ్ర‌మ‌ల్లోని సినిమాలు, సిరీస్‌లను ఒక‌చోట చేర్చి అవార్డులను అందించ‌డం ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. ఓటీటీప్లే అవార్డ్స్ వేడుకను అపరశక్తి ఖురానా -కుబ్రా సైట్ అద్భుతంగా నిర్వహించగా వేదిక‌పై ప్ర‌ద‌ర్శ‌న‌లు అహూతుల‌ను అల‌రించాయి.

విజేతల పూర్తి జాబితా ఇలా ఉంది:

సినిమాలు:

*ఉత్తమ చిత్రం: గర్ల్స్ విల్ బి గర్ల్స్ (అలీ ఫజల్ - రిచా చద్దా)

*ఉత్తమ దర్శకుడు (చిత్రం): ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకిలా)

*ఉత్తమ నటుడు (మేల్‌): జనాదరణ పొందినది: మనోజ్ బాజ్‌పాయ్ (డిస్పాచ్)

*ఉత్తమ నటుడు (మేల్‌) - విమర్శకులు: అనుపమ్ ఖేర్ (విజయ్ 69, ది సిగ్నేచర్)

*ఉత్తమ నటుడు (స్త్రీ) - విమర్శకులు: పార్వతి తిరువోతు (మనోరతంగల్)

*ఉత్తమ నటుడు (స్త్రీ) - జనాదరణ పొందినది: కాజోల్ (దో పట్టి)

*ఉత్తమ విల‌న్: సన్నీ కౌశల్ (ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా)

*ఉత్తమ హాస్య‌ నటుడు: ప్రియ మణి (భామా కలాపం 2)

*బ్రేక్‌త్రూ పెర్ఫార్మెన్స్ (పురుషుడు): అవినాష్ తివారీ (ది మెహతా బాయ్స్)

*బ్రేక్‌త్రూ పెర్ఫార్మెన్స్ (స్త్రీ): షాలిని పాండే (మహారాజ్)

వెబ్ సిరీస్ కేట‌గిరీ:

*ఉత్తమ సిరీస్: పంచాయత్ S3 (అరుణభ్ కుమార్, నిర్మాత , సహ-సృష్టికర్త .. విజయ్ కోశి, మాజీ నిర్మాత - ది వైరల్ ఫీవర్ అధ్యక్షుడు)

*ఉత్తమ దర్శకుడు (సిరీస్): నిఖిల్ అద్వానీ (ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్) - ప్రదీప్ మద్దాలి (విక్కటకవి)

*ఉత్తమ నటుడు (మేల్ ) - విమర్శకులు: జైదీప్ అహ్లావత్ (పాతాళ్‌ లోక్ S2)

*ఉత్తమ నటుడు (మేల్‌) - పాపులర్: రాఘవ్ జుయల్ (గ్యారా గ్యారా)

*ఉత్తమ నటి (మహిళ) - విమర్శకులు: నిమిషా సజయన్ (వేటగాడు)

*ఉత్తమ నటి (మహిళ) - పాపులర్: అదితి రావ్ హైదరీ (హీరామండి)

*ఉత్తమ సహాయ నటుడు (పురుషుడు): రాహుల్ భట్ (బ్లాక్ వారెంట్)

*ఉత్తమ సహాయ నటి (మహిళ): జ్యోతిక (డబ్బా కార్టెల్)

*ఉత్తమ హాస్య‌ నటుడు: నీరజ్ మాధవ్ (ల‌వ్ అండ‌ర్ క‌న్ స్ట్ర‌క్ష‌న్)

*అద్భుత ప్రదర్శన (మేల్‌): అభిషేక్ కుమార్ (తలైవెట్టియన్ పాళయం)

అద్భుత ప్రదర్శన (స్త్రీ): పత్రలేఖ (IC 814)

మరిన్ని OTTplay అవార్డుల కేటగిరీలు - విజేతలు:

*బెస్ట్ టాక్ షో హోస్ట్: రానా దగ్గుబాటి (ది రానా దగ్గుబాటి షో)

*ఉత్తమ రియాలిటీ షో: ది ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్

*ఉత్తమ స్క్రిప్ట్ లేని షో: షార్క్ ట్యాంక్ (బిమల్ ఉన్నికృష్ణన్- రాహుల్ హాట్‌చందాని)

*ట్రైల్‌బ్లేజర్ ఆఫ్ ది ఇయర్ (పురుషుడు): శ్రీమురళి (బగీర)

*వర్సటైల్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ (మహిళ): కని కుశ్రుతి (గర్ల్స్ విల్ బి గర్ల్స్/పోచర్/తలైమై సెయలగం/నాగేంద్రన్స్ హనీమూన్స్)

*వర్సటైల్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ (పురుషుడు): సిద్ధాంత్ గుప్తా (ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్/బ్లాక్ వారెంట్)

*ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్: ది రోషన్స్ (రాజేష్ రోషన్, రాకేష్ రోషన్ -శశి రంజన్)

* న్యూ-వేవ్ సినిమాకు మార్గదర్శక రచనలు: అశ్విని పునీత్ రాజ్‌కుమార్

* ప్రామిసింగ్ యాక్టర్ (మహిళ): హీనా ఖాన్ (గృహలక్ష్మి)

* ఉత్తమ OTT సిరీస్ డెబ్యూ: వేదిక (యక్షిణి)

* ప్రామిసింగ్ యాక్టర్ (మహిళ): అపర్శక్తి ఖురానా (బెర్లిన్)

* రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్: అవనీత్ కౌర్ (పార్టీ టిల్ ఐ డై)

* ట్రైల్‌బ్లేజర్ ఆఫ్ ది ఇయర్ (మహిళ): దివ్య దత్తా (శర్మజీ కి బేటీ -బండిష్ బండిట్‌ S2)

Tags:    

Similar News