బుక్ మై షో గేమ్‌పై బిగ్ డౌట్?

ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు ప్రకారం బుక్ మై షోలో బాట్స్ ద్వారా లైక్స్‌, ఇంటరెస్టింగ్ కౌంట్లు పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.;

Update: 2025-03-23 09:02 GMT

ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో బుక్మైషో యాప్ చుట్టూ కొన్ని అనుమానాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రేక్షకుల ఇన్‌స్టంట్ స్పందనతో హిట్ ఫ్లాప్‌ డిసైడ్ అయ్యే రోజుల్లో, ఒక్క టికెట్ బుకింగ్ యాప్‌పైనే అనుమానాలు వస్తుండటం ఫోకస్ లోకి వస్తోంది. మరీ ముఖ్యంగా ఓ ప్ర‌ముఖ నిర్మాత వరుసగా వాట్‌సాప్ గ్రూపుల్లో తన అసంతృప్తిని బయటపెడుతున్నా, గిల్డ్‌లో పెద్ద నిర్మాతలు మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు అన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్.

ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు ప్రకారం బుక్ మై షోలో బాట్స్ ద్వారా లైక్స్‌, ఇంటరెస్టింగ్ కౌంట్లు పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ బుక్ చేయని వారు కూడా ఓటింగ్ చేయగలుగుతున్న విధానం వల్ల నిజమైన ఆడియన్స్ స్పందన ఎక్కడ అనేది గుర్తించలేకపోతున్నామని నిర్మాతలు వాపోతున్నారు. కొందరు సినిమాలకు ఓవర్ హైప్, రివ్యూలు ముందుగానే ప్రాజెక్ట్ చేయడం వల్ల కంటెంట్ బలమైన సినిమాలు అవమానాన్ని ఎదుర్కొంటున్నాయని వాదిస్తున్నారు.

ఇదంతా ఇండస్ట్రీ కోసం జరుగుతున్నా, బుక్ మై షోను అడగాల్సిన పెద్ద పెద్ద నిర్మాతలు మాత్రం నిశ్శబ్దం పాటిస్తున్నారన్నది గమనార్హం. ఎందుకంటే వీరిలో చాలామంది థియేటర్లు నిర్వహిస్తున్నవారే కావడం, బుక్ మై షో నుండి కోటి నుంచి 20 కోట్ల వరకూ రుణాలు తీసుకున్న సంబంధాలున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇంకో కోణంగా చూస్తే, ఈ బుక్ మై షో సంస్థ స్వయంగా మల్టీప్లెక్స్‌లలో పెట్టుబడులు పెడుతోందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

ఇటీవలే ఓ సీనియర్ హీరో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్ ప్రాజెక్టులో బుక్ మై షో రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బుక్ మై షో వ్యాపార విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయాలంటే కొందరికి తలవంపు అయినట్లే. ఇక ఇందులో కొందరు ప్రముఖ గిల్డ్ సభ్యులు కూడా ఉన్నారు. అందులో ప్రముఖులు కూడా ఈ వ్యవహారంపై ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్క నాగా వంశీ మాత్రమే వాక్‌ఔట్ చేసినట్లు అనిపిస్తున్నా, ఇతరులు మాత్రం బుక్ మై షో వర్కింగ్ మీద జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయడంలేదని నిర్మాతల మద్య బజ్. టెక్నాలజీ ఆధారంగా సినిమాలకు మార్కెట్ ఉండే ఈ రోజుల్లో ఇలా ఓ యాప్‌దే ఫైనల్ గేమ్‌గా మారడం భవిష్యత్‌లో మళ్లీ మరో సమస్యగా మారకూడదన్నది కొన్ని అవగాహన కలిగిన నిర్మాతల భావన. మొత్తానికి, బుక్ మై షో వ్యవహారంపై నిర్మాతల గిల్డ్ స్థాయిలో ఓ క్లియర్ విచారణ జరపాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

Tags:    

Similar News