జాట్ ట్రైలర్.. బాలీవుడ్ లో గోపిచంద్ ఆటమ్ బాంబ్!
తెలుగులో ‘క్రాక్’, ‘వీర సింహారెడ్డి’ వంటి మాస్ బ్లాస్టర్లను ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలీవుడ్‌లో తన స్టైల్ చూపించేందుకు రెడీ అయ్యాడు.;
తెలుగులో ‘క్రాక్’, ‘వీర సింహారెడ్డి’ వంటి మాస్ బ్లాస్టర్లను ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలీవుడ్‌లో తన స్టైల్ చూపించేందుకు రెడీ అయ్యాడు. మాస్ యాక్షన్‌కు మారుపేరు అయిన సన్నీ డియోల్‌తో కలిసి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘జాట్’ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ద్వారా గోపీచంద్ బాలీవుడ్ ప్రేక్షకులకు ఓ రఫ్ అండ్ రా మాస్ డ్రామాను అందించబోతున్నాడు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, రణ్‌దీప్ హుడా లుక్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ ఈ హైప్‌ను మరింత పెంచేలా ఉంది. ఫుల్ యాక్షన్‌తో నిండిన ఈ వీడియో చూస్తే.. బాలీవుడ్ స్టైలులో కాదు, పక్కా సౌత్ మాస్ టెంప్లేట్‌లో సినిమా తీసినట్టే ఉంది. దీని వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవడం ఖాయం.
ట్రైలర్ చూస్తే.. విలన్ కు చెందిన లంకను తగలబెట్టేందుకు వచ్చిన దుర్మార్గుడిని అడ్డుకునే కథ అని అర్థమవుతుంది. మళ్లీ ఒకసారి మాస్ ఆటమ్ బాంబ్ మాస్ యాంగిల్‌ను గుర్తుకు తెస్తూ, సన్నీ డియోల్ స్క్రీన్‌పై రాయల్‌గా కనిపించాడు. నార్త్ మొత్తం నా పంజా తెలుసు.. ఇప్పుడు అందరూ చూస్తారు.. అనే డైలాగ్‌తో ఆయన దూకుడే మరో లెవెల్. అలాగే ఏది దొరికితే దానితో విలాంజ్ ను చితక్కొట్టే యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నట్లు అర్ధమవుతుంది.
ఇక విలన్ పాత్రలో రణ్‌దీప్ హుడా లుక్, బాడీ లాంగ్వేజ్ ఇంటెన్స్‌గా ఉంది. ఆయన పాత్ర ట్రైలర్‌కి ఓ భయానక ఫీల్ తీసుకొచ్చింది. సన్నీ డియోల్ - రణ్‌దీప్ హుడా మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌లే ఈ సినిమాకు కీలకం కానున్నాయి. వినీత్ కుమార్ సింగ్, రెజీనా కసాండ్రా, సయ్యామి ఖేర్, రమ్యకృష్ణ, స్వరూప ఘోష్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక థమన్ సంగీతం పనితీరు ఓ అదనపు మాస్ టచ్ ఇచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా మేకింగ్‌కి లెవెల్ తీసుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి స్టార్ బ్యానర్లు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా విజువల్స్ కూడా పెద్ద స్క్రీన్‌కు తగ్గట్టే గ్రాండ్‌గా ఉన్నాయి. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. బాలీవుడ్ మార్కెట్‌తో పాటు సౌత్ ఆడియన్స్‌ని కూడా టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం.. గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. మరి ఇది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించగలదా అన్నది చూడాలి.