అలాంటి బిరుదులు జనాలు ఇవ్వాలి: మోహన్ లాల్

అయితే రీసెంట్ గా మోహన్ లాల్ స్టార్‌డమ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ మొత్తాన్నే ఆలోచింపజేసేలా ఉన్నాయి.;

Update: 2025-03-24 10:12 GMT

ఇండియన్ సినిమా రంగంలో ఎంతమంది టాలెంటెడ్ నటీనటులు ఉన్నా కూడా అందులో ప్రతీ ఇండస్ట్రీలో ఒక చెప్పుకోదగ్గ నటుడు ఉంటాడు. ఆ విధంగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్. ఆయన ఎలాంటి పాత్ర చేసినా కూడా కంప్లీట్ యాక్టర్ అనే ట్యాగ్ అందుకోకుండా ఉండరు. గెస్ట్ రోల్స్ చేసినా సపోర్టింగ్ రోల్స్ చేసినా హీరోగా ఆయనకున్న క్రేజ్ ఎప్పటికి తగ్గలేదు. నెక్స్ట్ ఎల్2ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్ లో పాల్గొంటున్నారు.

అయితే రీసెంట్ గా మోహన్ లాల్ స్టార్‌డమ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ మొత్తాన్నే ఆలోచింపజేసేలా ఉన్నాయి. "సూపర్ స్టార్" లాంటి బిరుదులు నటులు తమకు తాముగా వేసుకునే ట్యాగ్స్ కావని, ప్రేక్షకులే తమ అభిమానం ద్వారా ఇచ్చే గౌరవాలివి అంటూ స్పష్టంగా చెప్పారు. అభిమానుల ప్రేమ, అనురాగంతో పాటు, నటుడిగా సుదీర్ఘ కాలం పాటు సక్సెస్‌ను సాధించినవారికే ఇటువంటి బిరుదులు చెలామణి అవుతాయని ఆయన అభిప్రాయం.

"ఇవి ఒక్కసారిగా వచ్చేవి కావు. కొన్ని సంవత్సరాల క్రమబద్ధమైన విజయాల తర్వాతే వస్తాయి," అని మోహన్‌లాల్ అన్నారు. స్టార్డమ్ కొత్త తరం నటుల్లో తగ్గుతోందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, "వారు టాలెంటెడ్‌గానే ఉంటారు. కానీ మంచి కథలు, మంచి దర్శకులు, మంచి సహనటులు లాంటి ఎలిమెంట్స్ కూడా కావాలి. నేను అదృష్టవశాత్తూ అత్యుత్తమ దర్శకులతో, గొప్ప సహనటులతో పని చేసే అవకాశం పొందాను. వాళ్లందరూ కలసి నన్ను ఈ విధంగా మలిచారు" అనిఅన్నారు.

ప్రస్తుతం మోహన్‌లాల్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 2019లో విడుదలైన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా మలయాళ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం. నటీడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన టీజర్, ఫస్ట్‌లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తిని చూపుతున్నారు. బిజినెస్ పరంగా కూడా సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.

మొత్తానికి, మోహన్‌లాల్ తన తరం నటనకు దారిదీపంగా నిలిచి, కొత్త తరం స్టార్లకు విలువైన సూచనలు ఇచ్చారు. నిజమైన స్టార్ అనిపించుకోవాలంటే, స్క్రిప్ట్, డెడికేషన్, కొలీగ్స్‌తో పాటు.. ప్రేక్షకుల అంగీకారం కీలకం అనే సందేశాన్ని ఆయన స్పష్టంగా అందించారు.

Tags:    

Similar News