ఎన్టీఆర్ - నీల్.. యుద్ధానికి ముందు ఇలా..

తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య లికితా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసిన ఓ ఫోటో మరోసారి ఈ సినిమాపై హైప్‌ను పెంచింది.;

Update: 2025-03-23 09:03 GMT

టాలీవుడ్‌లో సాలిడ్ మాస్ కాంబినేషన్స్ సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఇక అందులో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. KGF ప్రాంఛైజీ, సలార్ వంటి సినిమాలతో ప్రశాంత్ నీల్ కి ఉన్న ఇమేజ్, మాస్ స్క్రీన్ ప్లే’కి పేరు తెచ్చింది. అలాంటి డైరెక్టర్ తో ఎన్టీఆర్ కలయిక అంటే యుద్ధం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఇప్పుడే కాదు, ఈ కాంబినేషన్ గురించి వచ్చిన మొదటి వార్త నుంచే అభిమానుల్లో ఊహించలేని ఎగ్జైట్మెంట్ ఉంది.

తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య లికితా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసిన ఓ ఫోటో మరోసారి ఈ సినిమాపై హైప్‌ను పెంచింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ ఒక నైట్ డిస్కషన్‌లో మునిగి మాట్లాడుతున్న ఫోటో ఒకటి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తుంటే.. ప్రాజెక్టుపై వారు ఎంతగా ప్యాషన్‌తో పని చేస్తున్నారు అన్నది అర్థమవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నా, ఈ సినిమాలో కలిసే సమయంలో ప్రాజెక్ట్ స్పీడ్ మీద దూసుకెళ్లే అవకాశం ఉంది.

ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభమైయ్యింది. ప్రాథమికంగా జూనియర్ ఆర్టిస్టులపై కొన్ని సీన్లు తీశారట. వచ్చే ఏప్రిల్ రెండవ వారంలో ఎన్టీఆర్ కూడా ఈ షూట్‌లో జాయిన్ కాబోతున్నారని టాక్. ఈ లోగా మరో షెడ్యూల్ ప్లాన్ పూర్తవుతుండట. ఎన్టీఆర్ సెట్స్‌లోకి అడుగుపెట్టిన తరువాత ఇక వెనక్కు తిరిగి చూసే పనిలేదు. ఇది బిగ్ స్కేల్ పాన్ ఇండియా మూవీ కావడంతో మల్టీ లాంగ్వేజ్ టార్గెట్‌తో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

హీరోయిన్ విషయానికి వస్తే, కన్నడ బ్యూటీ రుక్మిణిని కథానాయికగా తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు, న్యాచురల్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఈ సినిమాకి అదనంగా ఉపయోగపడే అంశమవుతుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే, ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది మరో కొత్త జోడీ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో బడ్జెట్ ఖర్చవుతుందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్‌ను జనవరి 9న లాక్ చేశారు. సంక్రాంతి పండుగ సీజన్ టార్గెట్ చేయడం వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఇది కేవలం టాలీవుడ్‌కి మాత్రమే కాదు, బాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ క్రేజ్ పెంచే సినిమాగా మారే అవకాశం ఉంది. వార్ 2 తర్వాత ఇది ఎన్టీఆర్‌కు మరో పాన్ ఇండియా లెవెల్ బ్రేక్ అవుతుందన్న నమ్మకం అభిమానుల్లో గట్టిగానే ఉంది.

Tags:    

Similar News