నాని సినిమాకు విజయ్..?

ఆ సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.;

Update: 2025-03-24 18:30 GMT

న్యాచురల్ స్టార్ నాని సినిమాకు విజయ్ పనిచేసే ఛాన్స్ వస్తుందా.. అదేంటి ఇద్దరు ఇప్పుడు స్టార్స్ కదా మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా అనుకోవచ్చు. ఇక్కడ ప్రస్తావించింది హీరో విజయ్ దేవరకొండ కాదు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ గురించి. కాకినాడలో ఉంటూ సంగీతం మీద ఇంట్రెస్ట్ తో ఉన్న అతన్ని బేబీ సినిమాతో ఇండస్ట్రీకి తీసుకొచ్చారు ఎస్.కె.ఎన్, సాయి రాజేష్. బేబీ సినిమా సక్సెస్ లో విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ చూపించాడో తెలిసిందే. ఆ సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

బేబీ సినిమా తర్వాత నాని నిర్మించిన కోర్ట్ సినిమాకు మ్యూజిక్ అందించాడు విజయ్ బుల్గానిన్. ఈ సినిమాకు కూడా ఒక మంచి మెలోడీ పాట ఇచ్చి సినిమాను రిలీజ్ ముందే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. ఇక సినిమాలో ఎలాగు స్టఫ్ ఉంది కాబట్టి ప్రేక్షకులను అలరించింది. కోర్ట్ సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ కూడా మంచి ఇంపాక్ట్ కలిగించిందని చెప్పడంలో సందేహం లేదు.

ఐతే టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ నాని ఉంటాడు. అలాంటి వారికి ఛాన్స్ ఇస్తాడు. ఈ క్రమంలో విజయ్ బుల్గానిన్ కూడా నాని దృష్టిలో పడ్డాడు. నాని నిర్మించిన సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు నెక్స్ట్ నాని హీరోగా చేస్తున్న సినిమాలో కూడా విజయ్ అవకాశం అందుకుంటాడేమో చూడాలి. నాని సినిమాకు విజయ్ మ్యూజిక్ అందిస్తే మాత్రం నిజంగానే ఆ రేంజ్ వేరేలా ఉంటుందని అనిపిస్తుంది.

విజయ్ సినిమాలో మెలోడీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇలానే కొనసాగితే కచ్చితంగా విజయ్ మరో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డరెక్టర్ గా మెప్పించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే విజయ్ ని రెండు మూడు సినిమాలకు బుక్ చేసుకున్నారని తెలుస్తుంది. నాని సినిమాలో ఛాన్స్ అందుకుంటే మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా విజయ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లినట్టే. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాలకు ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అవగా రాబోయే సినిమాలకైనా విజయ్ కి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

నాని హిట్ 3 రిలీజ్ కు రెడీ అవగా శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ప్యారడైజ్ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాని ప్యారడైజ్ తర్వాతే ఏ సినిమా చేస్తాడన్నది చూడాలి.

Tags:    

Similar News