స్క్రిప్ట్ అడిగితే తల పొగరెక్కువన్నారు!
ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' లో నటిస్తున్నాడు.;
కన్నడ నటుడు యశ్ నేడు పాన్ ఇండియాలో ఓ సంచలనం. 'కేజీఎఫ్' హిట్ తో మార్కెట్ లో బ్రాండ్ గా మారాడు. అతడిపై వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. తెలుగు, హిందీలో సైతం అవకాశాలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి మాతృ భాషకే ప్రాధాన్యత ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' లో నటిస్తున్నాడు.
ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అలాగే బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'రామాయణం'లోనూ నటిస్తున్నాడు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే యశ్ మార్కెట్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. ఇదంతా ఇప్పటి మాట. యశ్ పాస్ట్ లైఫ్ లోకి వెళ్తే అతడి సక్సెస్ వెనుక ఎంతో పెయిన్ ఉంది. యశ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యాడు.
అతడి తండ్రి ఆర్టీసీ డ్రైవర్. యశ్ కోట్లాది రూపాయల స్టార్ అయిన అతడు తండ్రి ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే యశ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అతడికి పొగరెక్కువని అని చాలా మంది అను కున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. కెరీర్ ఆరంభంలో ఏ సినిమా అవకాశం వచ్చినా స్క్రిప్ట్ ఇవ్వమని అడిగే వాడుట. అలా అడిగిన ప్రతీసారి చాలా మంది ఫీలయ్యేవారు అట.
స్టార్ కాక ముందే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు? ఏంటి? అని మాట్లాడుకునే వారు అట. దీనికి అతడు తాజాగా బధులిచ్చాడు. తాను నటించబోయే కథ ఎలా ఉంటుందో? అందులో పాత్ర ఎలా ఉంటుందో తెలియకుండా ఎలా అంగీకరిస్తాను? అందుకే అలా చేసానన్నారు. సరిగ్గా అదే సమయంలో `మొగ్గిన మనసు` చిత్రంతో మంచి హిట్ పడిందని...అందుకు గాను ఆ టీమ్ కు ఎప్పటికీ రుణ పడి ఉంటనన్నారు.