లైఫ్‌లో హై ఇచ్చిన మూమెంట్ అదే!
అందులో తమిళనాడులో పుట్టి కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ప్రీతి ముకుందన్ కూడా కన్నప్ప కోసం ఆడిషన్ ఇచ్చింది.;

ఇండస్ట్రీలో ఒకరు అనుకున్న పాత్రలు మరొకరికి దక్కడం కొత్తేమీ కాదు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా హీరోయిన్ కోసం ఎంతోమందిని ఆడిషన్ చేశారు. అందులో తమిళనాడులో పుట్టి కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ప్రీతి ముకుందన్ కూడా కన్నప్ప కోసం ఆడిషన్ ఇచ్చింది.
కానీ ప్రీతికి ఆ ఛాన్స్ రాలేదు. కన్నప్పలో మంచు విష్ణు సరసన నటించే ఛాన్స్ నుపూర్ సనన్ కు ఇచ్చారు. అయితే అనుకోకుండా నుపూర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ అనుకోకుండా తిరిగి ప్రీతికే దక్కింది. దీంతో కన్నప్ప సినిమాలోని హీరోయిన్ పాత్ర తనకే రాసిపెట్టుందని ఎంతో సంతోషించింది ప్రీతి.
రీసెంట్ గా ప్రీతి ప్రభాస్ తో కలిసి వర్క్ చేసిన ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకుంది. ప్రభాస్ తో కలిసి నటిస్తానని తానెప్పుడూ అనుకోలేదని, అతనితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన లైఫ్ లోనే మర్చిపోలేనని, అసలు జీవితంలో ఒక్కసారైనా ప్రభాస్ ను కలుస్తానని తాను అనుకోలేదని, అలాంటిది తనకు ప్రభాస్ తో నటించే ఛాన్స్ రావడంతో అమ్మడు ఆకాశంలో తేలిపోతుంది. తన కెరీర్లో అన్నింటికంటే హై ఇచ్చే మూమెంట్ ప్రభాస్ తో కలిసి నటించడమే అని ప్రీతి తెలిపింది.
ఈ సినిమా కోసం తాను గుర్రపు స్వారీతో పాటూ కత్తి యుద్ధంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నానని చెప్పిన ప్రీతి ఇన్‌స్టాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ప్రీతి ఆల్రెడీ తెలుగులో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్ గా నటించింది కానీ ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో ప్రీతికి వెంటనే తెలుగులో మరో ప్రాజెక్టు రాలేదు.
ఇక కన్నప్ప విషయానికొస్తే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాపై అతను చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్లు నటించగా, కన్నప్ప ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.