మన్మధుడు భామకు ఏమైంది..?
ఈమధ్యనే రిలీజైన సందీప్ కిషన్ మజాకా సినిమాలో అన్షు నటించింది.;
కింగ్ నాగార్జునతో 23 ఏళ్ల క్రితం మన్మథుడు సినిమాలో నటించిన భమ అన్షు. ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ తో ఒక సినిమా చేయగా అది పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో ఎలా వచ్చిందో అలా వెళ్లింది. ఐతే మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత ఇంకా చెప్పాలంటే 23 ఏళ్ల తర్వాత మళ్లీ తెర మీద కనిపించింది. ఈమధ్యనే రిలీజైన సందీప్ కిషన్ మజాకా సినిమాలో అన్షు నటించింది.
నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో తెరకెక్కిన మజాకా సినిమాలో సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించారు. ఐతే ఆ సినిమాలో రావు రమేష్ ప్రేయసిగా అన్షు నటించింది. సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు కానీ అన్షు ఇన్నేళ్ల తర్వాత నటించడం సర్ ప్రైజింగ్ గా అనిపించింది.
ఇదిలాఉంటే లేటెస్ట్ గా అన్షు తన సోషల్ మీడియాలో షాకింగ్ న్యూస్ చెప్పింది. నెల రోజుల క్రితం తనకు గాయమైందని తలకు కుట్లు కూడా పడ్డాయని చెప్పుకొచ్చింది. ఫిబ్రవరి 26 సందీప్ కిషన్ మజాకా సినిమా రిలీజైంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ గాయమై ఉండొచ్చు. మజాకా ప్రమోషన్స్ కోసం మొన్నటిదాకా ఇండియాలోనే ఉన్న అన్షు ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఆమె చెప్పిన విషయం విని తెలుగు ఆడియన్స్ షాక్ అయ్యారు.గాయపడిన ఆమెను తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వల్ల కోలుకున్నానని చెప్పింది.
మజాకా సక్సెస్ అయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ మన్మథుడు తర్వాత సినిమాలు వదిలి యూఎస్ వెళ్లిన అన్షు మళ్లీ మజాకా తర్వాత తన వల్ల కాదనుకుందో ఏమో కానీ ఆమె యూఎస్ కి వెళ్లింది. చేశారని చెప్పింది అన్షు. ఐతే మన్మధుడు లో అన్షు ఎలా ఉందో ఈమధ్య రిలీజైన మజాకాలో కూడా అంతే అందంగా కనిపించింది.
అందాల భామ నుదుట కుట్లు పడటం ఏంటంటూ ఆమె త్వరగా కోలుకోవాలని తెలుగు ఆడియన్స్ కోరుతున్నారు. ఐతే అన్షు గాయానికి కారణం ఏంటి ఆమె ఎలా ఆ విధంగా గాయాల పాలయ్యారు అన్న విషయాన్ని వెల్లడించలేదు. ఐతే తెలుగులో ఆమె చేసిన చాలా తక్కువ సినిమాలే అయినా తెలుగు ఆడియన్స్ మాత్రం ఆమెను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారు. ఐతే మజాకాతో రీ ఎంట్రీ ఇచ్చిన అన్షు ఆ సినిమా ఫలితం ఇంప్రెస్ చేయకపోయినా మళ్లీ మళ్లీ ఆమె సినిమాల్లో నటించాలని కోరుతున్నారు.