హీరామండి బ్యూటీ స్టన్నింగ్ లుక్ వైరల్
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇటీవల ఛాలెంజింగ్ పాత్రల్లో అవకాశాలు అందుకుంటోంది.;
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'హీరామండి' వెబ్ సిరీస్‌తో సంజీదా షేక్ పేరు మార్మోగింది. ఈ బ్యూటీ అద్భుతమైన అభినయం, హావభావాల గురించి యువతరంలో చర్చ సాగింది. వేశ్య పాత్రలో సంజీదా అభినయానికి వందశాతం మార్కులు వేసారు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇటీవల ఛాలెంజింగ్ పాత్రల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇంతకుముందు హృతిక్ `ఫైటర్`లోను ఈ భామ నటించింది. తైష్ (2020), కాళీ ఖుహీ (2020) లాంటి చిత్రాల్లోను నటించింది.
మరోవైపు సంజీదా వరుస ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ప్రఖ్యాత ఫ్యాబ్ లుక్ మ్యాగజైన్ కవర్ పేజీపై తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోజులిచ్చింది. సంజీదా బోల్డ్ గా తన అందాలను ఎలివేట్ చేసింది. పర్పుల్ కలర్ డిజైనర్ ఫ్రాక్ ని ధరించిన సంజీదా.. కిల్లర్ లుక్‌తో కట్టి పడేస్తోంది. ఈ గౌన్ థై స్లిట్ ఎలివేషన్ తన ఆకర్షణను పెంచింది. ఇక తన మెడలో ఉన్న ఆ డిజైనర్ చైన్ అంతే ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ని ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ చేస్తున్నారు.
2024లో హీరామండితో గుర్తింపు పొందాక, 2025లో తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉత్సాహంతో కనిపిస్తోంది. టీవీ కోసం పని చేస్తున్నప్పుడు లీడ్ క్యారెక్టర్స్ మాత్రమే చేయాలనుకున్నానని, నాలో పురోగతిని చూసిన తర్వాత నమ్మకంగా ఉన్నానని తెలిపింది. ప్రయోగాలు చేసినా మెప్పించగలననే నమ్మకం పెరిగిందని సంజీదా ఇటీవలి ఇంటర్వ్యూలో అన్నారు.