ఇంక్రెడిబుల్ ఇమ్రాన్ అంటున్న గూఢచారుడు..!

ఈ సినిమా కోసం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్న శేష్ అందుకు తగినట్టుగానే సినిమా ఉండేలా చూస్తున్నాడు.;

Update: 2025-03-24 16:53 GMT

ఏడేళ్ల క్రితం వచ్చిన గూఢచారి సినిమా పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్ గా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించిన గూఢచారి సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 చేస్తున్నాడు అడివి శేష్. ఈ సినిమా కోసం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్న శేష్ అందుకు తగినట్టుగానే సినిమా ఉండేలా చూస్తున్నాడు.

అడివి శేష్ లీడ్ రోల్ లో వస్తున్న గూఢచారి 2 సినిమాను వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలాఉంటే గూఢచారి విలన్ ఇమ్రాన్ హష్మి బర్త్ డే సందర్భంగా అతని గురించి స్పెషల్ విషెస్ అందించాడు అడివి శేష్. ఇమ్రాన్ హష్మితో కలిసి పనిచేయడం చాలా ఎంజాయ్ చేశానని.. ఆయన హ్యుమానిటీ సహృదయం నిజాయితీ చాలా ప్రత్యేకత అని అన్నారు. అంతేకాదు ఆయనతో పనిచేయడం ఇంక్రెడిబుల్ ఎక్స్ పీరియన్స్ అని అన్నారు. ఆయనతో పనిచేసిన ప్రతి మూమెంట్ బ్లాస్ట్ గా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ హష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు అడివి శేష్.

ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ కిస్సింగ్ హీరోగా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఐతే ఈమధ్య హిందీలో కూడా ఆయన సినిమాల దూకుడు తగ్గించాడు. ప్రస్తుతం తెలుగులో ఆయన అడివి శేష్ గూఢచారి 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన తెలుగు ఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు ఇమ్రాన్ చేసిన సినిమాలు తెలుగు ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.

గూఢచారి 2 తన మార్క్ ఇంపాక్ట్ కలిగేలా చేస్తారని తెలుస్తుంది. మరి అడివి శేష్, ఇమ్రాన్ హష్మి ఆన్ స్క్రీన్ ఫైట్ ఎలాఉండబోతుందో చూడాలి. సినిమా తీసే టైం లో చాలా సైలెంట్ గా ఉంటూ పూర్తయ్యాక ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై బజ్ పెంచుతాడు అడివి శేష్. గూఢచారి సినిమా 2018 లో వచ్చి సక్సెస్ అందుకోగా ఏడేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జి2 దానికి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి అడివి శేష్ జి2 ఆడియన్స్ ని ఎంతమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News