రాబిన్ హుడ్.. హైలెట్ అయ్యే లీకులు వదిలిన దర్శకుడు!

అలాగే సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సీన్స్ పై కూడా లీక్స్ ఇచ్చారు.;

Update: 2025-03-24 22:30 GMT

యంగ్ హీరో నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. మార్చి 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం సాంగ్స్, టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల మీడియాతో మాట్లాడారు. సినిమాలోని ప్రత్యేకతలు, నితిన్ పాత్ర విశేషాలు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సీన్స్ పై కూడా లీక్స్ ఇచ్చారు.

వెంకీ కుడుముల మాట్లాడుతూ, “ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్‌తో పనిచేయడం గర్వంగా భావిస్తున్నాను. స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా మేమ్ ఏం చేసినా అడగలేదు. సినిమాను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో అద్భుతమైన సహకారం అందించారు” అని తెలిపారు. అలాగే హీరో నితిన్ తన మీద పూర్తి నమ్మకంతో ఈ ప్రయాణంలో ముందుకు వచ్చాడని, అతని సపోర్ట్ వల్లే ఇది తన కెరీర్ బెస్ట్ మూవీగా తయారయ్యిందని చెప్పారు.

ప్రేక్షకుల కోసం సినిమా మొదటి 20 నిమిషాల్లోనే నితిన్ వేరే వేరే గెటప్స్‌లో కనిపిస్తూ కథను ముందుకు నడిపించేలా ఉన్నారని, అది హైలెట్ అవుతుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిందని, అయితే రెగ్యులర్ కామెడీ సినిమాలతో మాత్రం ఇది భిన్నంగా ఉంటుందని చెప్పారు. సినిమాలో వచ్చే కామెడీ ఎపిసోడ్స్ అన్నీ సహజంగా సాగుతాయని, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుందని చెప్పాడు.

శ్రీలీల పాత్ర కూడా సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కీలకమని వెంకీ వెల్లడించాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ కామెడీని ప్రేక్షకులు ఎంతో ఆస్వాదించబోతున్నారని చెప్పారు. అలాగే ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ మాన్ అని, తన కూతుళ్ల కోసమే రీల్స్ మొదలుపెట్టాడని చెప్పారు. వార్నర్ ఈ సినిమాలో డెబ్యూ చేయడం తనకు ప్రత్యేకంగా అనిపించిందని చెప్పాడు. ‘అది దా సర్ ప్రైజు’ పాటతో కేతికా శర్మకు మంచి రెస్పాన్స్ వస్తోందని, జివి ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో స్థాయి తీసుకెళ్లిందని అన్నారు.

ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా భిన్నంగా ఉండబోతున్నాయని, అయితే వాటికి కూడా ఫన్ టచ్ తో, సహజంగా కథలో కలపడం జరిగింది అని చెప్పారు. చివరగా వెంకీ కుడుముల మాట్లాడుతూ, “మార్చి 28న థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకులకు కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్ని ఉన్న పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబిన్ ఉండబోతోంది. ఒకసారి కాకుండా రెండోసారి చూడాలనిపించే సినిమా ఇది” అని తెలిపారు. ఇక వెంకీ కుడుములకు ఇది మూడో సినిమా. మొదటి సినిమా చలో సాలీడ్ హిట్ కాగా ఆ తరువాత వచ్చిన భీష్మ మరో రేంజ్ లో హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు రాబిన్ హుడ్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News