హీరో అభిప్రాయం డైరెక్టర్ తప్పు చేసాడని!
అమీర్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `పీకే` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.;
అమీర్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `పీకే` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రమిది. ఏలియన్ పాత్రలో అమీర్ ఖాన్ నటన నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇలాంటి కథ, పాత్రతో సినిమా తీయడం అన్నది గొప్ప ఐడియా. ఇలాంటి యూనిక్ థాట్స్ హిరాణీ స్పెషలిస్ట్. ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాలు అందించాలని నిరంతరం తపిస్తుంటారు.
అందుకే చేసినవి కొన్ని సినిమాలే అయినా అవి ఆణిముత్యాలుగా మిగిలి పోతుంటాయి. అయితే ఈ సినిమా విజయం అమీర్ ఖాన్ కి అంతగా సంతృప్తినివ్వలేదు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంగతి స్వయంగా అమీర్ ఖాన్ రివీల్ చేసారు. ఈ సినిమా ముందు అనుకున్న కథలో సెట్స్ కి వెళ్లే సరికి చాలా మార్పులొచ్చాయన్నారు. తొలుత రాజ్ కుమార్ రాసిన కథకు సెట్స్ కి వెళ్లిన తర్వాత మార్చిన కథ చాలా తేడాగా ఉంటుందన్నారు.
సినిమా క్లైమాక్స్ అప్పుడే రిలీజ్ అయిన మరో హిందీ సినిమాకు రిలవెంట్ గా ఉంటుంది? అన్న సందేహంతో `పీకే` క్లైమాక్స్ పూర్తిగా మార్చేసారట. అయితే ఆ క్లైమాక్స్ కంటే ముందు రాసిన క్లైమాక్స్ ఎంతో బాగుంటుందన్నారు. అదే తీసి ఉంటే సినిమా ఇంకా పెద్ద విజయం సాధించేదన్నారు. అయితే పీకే రిజల్ట్ విషయంలో రాజ్ కుమార్ మాత్రం సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఆయన పెద్దగా డిస్పాయింట్ కానట్లే మాట్లాడారు. బాగా ఆడిన సినిమా పీకే అయితే...బాగా ఆడని చిత్రం డంకీ అని రాజ్ కుమార్ సమాధానం ఇచ్చారు.
మరి ఈ సంచలన కాంబినేషన్ మళ్లీ కొత్త సినిమా ఏదైనా ప్లాన్ చేయాలని అమీర్ ఖాన్ అభిమానులు కోరుకుంటున్నారు. అమీర్ కూడా `లాల్ సింగ్ చడ్డా` తర్వాత ఇంత వరకూ కొత్త సినిమా ప్రకటించలేదు. ఆ సినిమా పరాజయంతో అమీర్ బాగా నిరాశ చెందారు. దీంతో కొత్త సినిమా తో వస్తే అది హిట్ మాత్రమే అవ్వాలనే కాన్పిడెన్స్ తో ఉన్నారు.