పవన్ సినిమా లేనట్లే.. మరి అడ్వాన్స్ సంగతేంటి?

తల్లూరి నిర్మాణంలో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందాల్సిన ఈ సినిమాకి సంబంధించి ఆరంభంలో వచ్చిన పోస్టర్ ఒక్కటే బజ్ క్రియేట్ చేసింది.;

Update: 2025-03-23 09:01 GMT

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ప్రకటించగానే ఫ్యాన్స్ లో ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ అనౌన్స్ మెంట్ జరిగినప్పుడు కూడా అలానే జరిగింది. మాస్ మేకర్ సురేందర్ రెడ్డితో పవర్ స్టార్ సినిమా అంటే ఇంకేమైనా ఉందా అని అభిమానులు ఎగిరి గంతేశారు. కానీ ఈ ప్రాజెక్టు గత నాలుగు సంవత్సరాలుగా పట్టాలెక్కడానికి ఒక్క అడుగు కూడా వేయలేదు.

ఇప్పుడు అయితే ఈ కాంబినేషన్ వర్కవుట్ కాకపోవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రామ్ తల్లూరి నిర్మాణంలో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందాల్సిన ఈ సినిమాకి సంబంధించి ఆరంభంలో వచ్చిన పోస్టర్ ఒక్కటే బజ్ క్రియేట్ చేసింది. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి అనే టాక్ వచ్చినప్పటికీ.. షూటింగ్ మొదలయ్యే దశకి మాత్రం ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేకపోయింది.

ఇందులో మెయిన్ అడ్డంకి పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూలే. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఊస్తాద్ భగత్ సింగ్, OG వంటి ప్రాజెక్టులతో పవన్ ఫుల్ బిజీగా ఉండగా, అదే సమయంలో పొలిటికల్ కమిట్‌మెంట్స్ వల్ల మరింతగా డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అసలే డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు సమయం కేటాయించడం కష్టంగా మారింది. దీంతో మేకర్స్ ఇప్పటికైనా వేరే హీరోతోనే ఈ ప్రాజెక్టును కొనసాగించాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు కథను మార్చకుండా, దానికి సూటయ్యే మరో హీరోను తీసుకుని కథను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఆ కొత్త హీరో ఎవరో అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇది పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం కొంత నిరాశ కలిగించే విషయమే కానీ, కథ మీద నమ్మకం ఉన్న నిర్మాతలు పూర్తిగా ప్రాజెక్టును ఆపేయకుండా వేరే మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ఇక్కడ విశేషం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కు నిర్మాత రామ్ అడ్వాన్స్ ఇచ్చినట్లు గత ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. కచ్చితంగా ఆయనతో ఏదో ఒక సినిమా జరిగేలా ప్లాన్ చేస్తామని అన్నారు. ఇప్పటివరకు పవన్ ఏదో ఒక రకంగా సినిమాలకు డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. గతంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆయన సినిమాలు ఒప్పుకోక తప్పలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు. చాలా బిజీ అయ్యారు కాబట్టి ఏదో ఒక సినిమా చేస్తారా లేదంటే అడ్వాన్స్ లు తిరిగి వెనక్కి ఇస్తారా అనేది చూడాలి. ఇక మరోవైపు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘రేసర్’ అనే కొత్త ప్రాజెక్టు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News