ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే

ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు చాలానే ఉన్నాయి.

Update: 2025-02-24 11:22 GMT

గత వారం పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్ని కలిపి చాలానే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. థియేట్రికల్‌ రిలీజ్ అయిన సినిమాలకు సైతం మంచి స్పందన దక్కడంతో పాటు ఓటీటీ సినిమాలతోనూ ప్రేక్షకులు వినోదాల విందు పొందారు. ఇక ఈ వారం సైతం వీకెండ్‌కి వినోదాల విందు రెడీగా ఉంది. పలు వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు ఇలా ఎన్నో రకాలుగా తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం రెడీ అవుతున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు చాలానే ఉన్నాయి.

నెట్‌ ఫ్లిక్స్‌ :

డబ్బా కార్టెల్‌ (వెబ్ సిరీస్‌) (తెలుగు డబ్బింగ్‌) - ఫిబ్రవరి 28

అమెజాన్ ప్రైమ్‌ :

సుడల్ సీజన్ 2 (వెబ్ సిరీస్‌) (తెలుగు డబ్బింగ్‌) - ఫిబ్రవరి 28

సూపర్‌ బాయ్స్‌ ఆఫ్‌ మాలేగావ్‌ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 28

జిద్దీ గర్ల్స్ (హిందీ వెబ్‌ సిరీస్‌ ) - ఫిబ్రవరి 27

హౌస్‌ ఆఫ్ డెవిల్‌ (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌ ) - ఫిబ్రవరి 27

జియో హాట్‌స్టార్‌ :

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్‌ (మలయాళ వెబ్ సిరీస్‌) - ఫిబ్రవరి 28

బీటిల్ జ్యూస్‌ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28

సూట్స్ : లాస్ ఏంజిల్స్ (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌ ) - ఫిబ్రవరి 24

ది వాస్ప్‌ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28

ఎంఎక్స్‌ ప్లేయర్‌ :

ఆశ్రమ్‌ 3 పార్ట్‌ 2 (హిందీ వెబ్ సిరీస్‌) - ఫిబ్రవరి 27

వీకెండ్‌కి ఇంకా మూడు నాలుగు రోజుల సమయం ఉంది కనుక అప్పటి వరకు మరికొన్ని సినిమాల డేట్లను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన రెండు మూడు సినిమాలు చివరి నిమిషంలో ఓటీటీ సందడికి రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఈ వారం థియేట్రికల్‌ రిలీజ్ కాబోతున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. దాంతో తెలుగు ప్రేక్షకులకు ఈ వారాంతా వినోదానికి డోకా లేదు.

Tags:    

Similar News