ఫిబ్రవరి 21 : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

ఈవారం కూడా టాలీవుడ్‌ బాక్సాఫీస్ ముందుకు పెద్ద సినిమాలు రావడం లేదు. చిన్న సినిమాలు, డబ్బింగ్‌ సినిమాలు ఉన్నాయి.

Update: 2025-02-21 06:15 GMT

ఈవారం కూడా టాలీవుడ్‌ బాక్సాఫీస్ ముందుకు పెద్ద సినిమాలు రావడం లేదు. చిన్న సినిమాలు, డబ్బింగ్‌ సినిమాలు ఉన్నాయి. ఒకటి రెండు కాస్త బజ్ ఉన్న సినిమాలు అయినా జనాలు వాటిని థియేటర్‌కు వెళ్లి చూస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈసారి ఎలాగూ పెద్ద సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ కాలేదు. కనుక ఓటీటీలో సినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవారం ఓటీటీ సినిమాల జాతర మొదలైంది. నేటి అర్ధరాత్రి నుంచి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈటీవీ విన్‌ ఓటీటీలో సమ్మేళనం అనే తెలుగు సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఫిబ్రవరి 20 నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌ మొదలైంది. జియో హాట్‌ స్టార్‌ ద్వారా ది వైట్‌ లోటస్‌ వెబ్‌ సిరీస్‌, ఊప్స్‌ అబ్‌ క్యా వెబ్‌ సిరీస్‌తో పాటు ఆఫీస్‌ అనే వెబ్‌ సిరీస్ సైతం స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో రీచర్‌ 3 వెబ్‌ సిరీస్‌తో పాటు, బాలీవుడ్‌ మూవీ బేబీ జాన్‌ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో జీరోడే అనే వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇవే కాకుండా మరికొన్ని ఇంగ్లీష్ సిరీస్‌లు, సినిమాలు సైతం ఈ వారం ప్రముఖ ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

నెట్‌ఫ్లిక్స్‌ :

డాకు మహారాజ్‌ (తెలుగు)

జీరోడే (వెబ్‌సిరీస్‌)

ఈటీవీ విన్ :

సమ్మేళనం (తెలుగు)

అమెజాన్‌ ప్రైమ్‌ :

రీచర్‌ 3 (వెబ్‌సిరీస్‌)

బేబీజాన్ – (హిందీ)

జియో హాట్‌స్టార్‌ :

ది వైట్‌ లోటస్‌ (వెబ్‌సిరీస్‌)

ఊప్స్‌ అబ్‌ క్యా (వెబ్ సిరీస్‌)

ఆఫీస్‌ (వెబ్ సిరీస్‌)

జీ5 :

క్రైమ్‌ బీట్‌ (వెబ్‌సిరీస్‌) – ఫిబ్రవరి 21

Tags:    

Similar News