సుడల్ సిరీస్ సీజన్ 2.. దూసుకుపోతున్నట్లు ఉందే..

సుడల్‌: ది వొర్టెక్స్‌ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కొంత కాలం క్రితం స్ట్రీమింగ్ అయ్యి మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.;

Update: 2025-03-01 12:30 GMT

సుడల్‌: ది వొర్టెక్స్‌ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కొంత కాలం క్రితం స్ట్రీమింగ్ అయ్యి మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. దీంతో సుడల్ సీజన్ 2పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా సుడల్ ది వొర్టెక్స్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుడల్ 2 సీజన్ రిలీజ్ అవ్వగా.. ఐశ్వర్య రాజేశ్‌, కథిర్‌, లాల్‌, శరవణన్‌, మంజిమా మోహన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మంచి క్రియేటర్స్ గా పేరు సంపాదించుకున్న పుష్కర్-గాయత్రి రూపొందించిన ఆ వెబ్ సిరీస్ ను బ్రహ్మా-సర్జన్‌ కె.ఎం తెరకెక్కించారు.

అయితే ఇప్పుడు సీజన్ -2 మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయాన్ని సాధించడంతో సీజన్ 2పై అందరి దృష్టి పడిందనే చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

సుడల్ సీజన్-2 ఆసక్తికరమైన కొత్త కథాంశంతో రూపొందించారని అంతా చెబుతున్నారు. పాత్రలు డిజైనింగ్, ఎమోషనల్ డెప్త్ అందరినీ ఆకర్షిస్తుందని అంటున్నారు. సెకండ్ సీజన్‌ లో ట్విస్టులు, మలుపులు మాత్రం ఊహించని విధంగా థ్రిల్ చేస్తాయని, కొన్ని సీన్స్ ఓ రేంజ్ ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాయని కామెంట్లు పెడుతున్నారు.

సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సిరీస్ లో కీలక పాత్ర పోషించిందని, సస్పెన్స్‌ కు కావాల్సిన మూడ్‌ ను చాలా బాగా క్రియేట్ చేసిందని అంటున్నారు. సినిమాటోగ్రఫీ కూడా ఆ విషయంలో ముఖ్యపాత్ర పోషించిందని చెబుతున్నారు. ఏదేమైనా డైరెక్టర్స్ బ్రహ్మా- సర్జన్‌ కె.ఎం బెస్ట్ ఇచ్చారని గట్టిగా చెప్పవచ్చు.

అదే సమయంలో రోల్స్ విషయానికొస్తే.. ప్రతి ఒక్క క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉందని చెప్పాలి. అంతా నటించారు అనే కన్నా జీవించారని అనాలి. ఐశ్వర్య రాజేష్ తన యాక్టింగ్ తో మెప్పించింది. సస్పెక్ట్స్‌ గా నటించిన వాళ్లలో దాదాపుగా చాలా మంది తెలుగు హీరోయిన్లే. వారంతా నటనతో అలరించారు. మొత్తానికి సుడల్ సిరీస్ 2 ఆకట్టుకుని దూసుకుపోతోంది. మరి మీరు సిరీస్ చూశారా?

Tags:    

Similar News