దుపాహియా వెబ్ సీరీస్ ఎలా ఉంది..?

లేటెస్ట్ గా అమెజాన్ ప్రైం వీడియోలో రూరల్ కామెడీ ఇంకా మెసేజ్ తో వచ్చింది దుపాహియా వెబ్ సీరీస్. సోనం నాయర్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ 5 ఎపిసోడ్స్ తో వచ్చింది.;

Update: 2025-03-09 09:24 GMT

ప్రతి వారం ప్రేక్షకులకు సరికొత్త సీరీస్ లతో ఓటీటీ సంస్థలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. వీకెండ్ వస్తే థియేటర్ లో కొత్త సినిమా ఎలా రిలీజ్ అవుతుందో ఓటీటీలో కొత్త సీరీస్ లు కూడా రిలీజ్ అవుతుంటాయి. లేటెస్ట్ గా అమెజాన్ ప్రైం వీడియోలో రూరల్ కామెడీ ఇంకా మెసేజ్ తో వచ్చింది దుపాహియా వెబ్ సీరీస్. సోనం నాయర్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ 5 ఎపిసోడ్స్ తో వచ్చింది.

ఇంతకీ ఈ సీరీస్ కథ ఏంటంటే దడక్ పూర్ లో టీచర్ గా పనిచేస్తున్న బన్వారీ ఝా తన కూతురు రోష్నికి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఐతే అప్పటికే రోష్ని తన చిన్ననాటి స్నేహితుడు అమావాస్ తో రిలేషన్ లో ఉంటుంది. అయినా సరే రోష్ని తండ్రి చూపించిన సంబంధాన్ని చేసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో కట్నం కోసం ఐదు లక్షల విలువ గల మోటర్ బైక్ ని కుబేర్ డిమాండ్ చేస్తాడు. ఆ బైక్ కి మ్యారేజ్ కి సంబంధం ఏంటి మిగతా కథ ఎలా నడిచింది అన్నది వెబ్ సీరీస్ ఉంటుంది.

అంతకుందు లాపాట లేడీస్ లో నటించి మెప్పించిన స్పర్ష్ శ్రీవాస్తవ ఈ సినిమాలో కూడా మెప్పించాడు. భువన్ అరోరా కూడా అమావాస్ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. గజరాజ్ రావు, శివాని రఘువంశీ, రేణుక వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు. కామెడీ ప్రధానంగా సాగుతూ రూరల్ మెసేజ్ ని కూడా అందించేలా వచ్చిన ఈ దుహాపియా వెబ్ సీరీస్ కొంతమేరకు ప్రేక్షకులను అలరించిందనే చెప్పొచ్చు.

ఐతే ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే సీరీస్ ఇంకాస్త బాగుండేది. ముఖ్యంగా అక్కడక్కడ స్లో అయినట్టుగా అనిపిస్తుంది. పాత్రలు వాటి స్వభావాల ద్వారానే కథనం నడిపించేశాడు. సీరీస్ తో దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పగలిగాడు. సీరీస్ చూసిన ఆడియన్స్ కామెడీ ఎంటర్టైన్ గా భావిస్తారు. ఐతే కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. టైం పాస్ కి ఒకసారి చూసేలా దుపాహియా సీరీస్ ఉంది.

Tags:    

Similar News