తండేల్ ఓటీటీలో ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన తండేల్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించడంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

Update: 2025-03-02 16:46 GMT

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన తండేల్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించడంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. థియేటర్లలో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇక తండేల్ ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుంది, ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుంది అన్న ఉత్కంఠకు తాజాగా సమాధానం లభించింది.


తండేల్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, మార్చి 7 నెట్‌ఫ్లిక్స్‌లో తండేల్ ప్రీమియర్ కాబోతుంది. థియేట్రికల్ రిలీజ్ నుంచి కేవలం నాలుగు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రానుండడంతో ఆడియన్స్ కోసం ఇది ఓ మంచి అప్డేట్‌. సినిమా విడుదలైనప్పటి నుంచి హిట్ టాక్‌తో దూసుకెళ్లడం, నాగచైతన్య - సాయిపల్లవి జంట మరోసారి మాయ చేయడంతో ఈ మూవీ ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, ఇతర భాషల ఆడియన్స్‌కూ ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. తండేల్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఒక మంచి పాన్ ఇండియా లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. నాగచైతన్య - సాయిపల్లవి అద్భుతమైన కెమిస్ట్రీ, లవ్ ను మళ్లీ ఒకసారి అందరూ ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమాకు సంగీతం మరో ప్రధాన బలంగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే తండేల్ సాంగ్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మిలియన్ల కొద్దీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా "బుజ్జితల్లి" లవ్ సాంగ్ ఎంతటి వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విజయం సాధించిన ఈ మూవీ ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

నాగచైతన్య కెరీర్‌లోనే తండేల్ ఒక రికార్డ్ చిత్రంగా నిలుస్తోంది. డిఫరెంట్ లవ్ స్టోరీగా, భావోద్వేగాలతో ముడిపడిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతూనే ఉంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో భారీ స్థాయిలో ప్రమోషన్‌ ప్లాన్ చేస్తుండటంతో సినిమా ఓటీటీలోనూ సంచలన రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, తండేల్ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారికి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా మరో అద్భుతమైన అవకాశం దక్కనుంది. మార్చి 7 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుండటంతో ఇకపై దీని రన్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News