పిక్ టాక్ : క్యూట్ జాన్వీ కపూర్‌ని చూశారా!

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా కాలం అయింది.;

Update: 2025-03-10 05:21 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా కాలం అయింది. ఈమె అక్కడ పెద్దగా సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది. అయినా సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ కారణంగా ఎక్కువ ఆఫర్లు దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో ఈమెకు దక్కిన గుర్తింపు కారణంగా బాలీవుడ్‌లో ఫ్లాప్‌లు పడ్డా వరుసగా ఆఫర్లు అయితే వచ్చాయి. తాజాగా తెలుగులో ఎన్టీఆర్‌కి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మొదటి కమర్షియల్‌ బ్రేక్‌ను దక్కించుకుంది. తెలుగులో ఈ అమ్మడు ప్రస్తుతం రామ్‌ చరణ్‌కి జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే.


ఎన్టీఆర్‌తో దేవర సినిమాలో నటించి నటిగా ఆశించిన స్థాయిలో అలరించలేక పోయిన జాన్వీ కపూర్‌కి ప్రస్తుతం నటిస్తున్న రామ్‌ చరణ్‌ మూవీతో కచ్చితంగా మంచి మార్కులు వస్తాయని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న సినిమాలో జాన్వీ కపూర్‌ పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుంది. బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనలో హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కనుక ఈ సినిమాలోనూ జాన్వీ కపూర్‌ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండటం ద్వారా టాలీవుడ్‌లో ఈ అమ్మడు మరింతగా ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. ప్రతి సారి జాన్వీ కపూర్‌ ఫోటోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఏ ఔట్‌ ఫిట్‌లో అయినా జాన్వీ కపూర్‌ చాలా అందంగా ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి ఫోటోలను షేర్‌ చేసే జాన్వీ కపూర్‌ తాజాగా మరో సారి తన క్యూట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. ఒక డ్రింక్‌ను తాగుతూ క్యూట్‌గా నవ్వుతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన జాన్వీ కపూర్‌ మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంత క్యూట్‌గా ఉండటం జాన్వీ కపూర్‌ కే సాధ్యం అంటూ కొందరు నెటిజన్స్ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్‌ చేస్తున్నారు.


టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ మరో వైపు బాలీవుడ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. తెలుగులో ఈ అమ్మడు చేస్తున్న సినిమా ప్రస్తుతం ఒకేటే అనే విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీ కాకుండా జాన్వీ కపూర్‌ మరో అవకాశంను తన ఖాతాలో వేసుకుందనే వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో జాన్వీ కపూర్‌ ఒక హీరోయిన్‌గా ఎంపిక అయిందట. సినీ వర్గాల ద్వారా అందుతున్న ప్రచారం ప్రకారం అల్లు అర్జున్‌తో అట్లీ రూపొందిస్తున్న సినిమాలు నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నారట. అందులో మెయిన్‌ హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

Tags:    

Similar News