ప్రభాస్ ‘బక’ - ప్రశాంత్ వర్మ ప్లాన్ ఏంటీ?
ప్రభాస్ ప్రతి ప్రాజెక్ట్‌ను ఓ కొత్త లెవెల్ కు తీసుకెళ్లే హీరో. ఆయన కొత్త సినిమాల ప్రకటనలు ఎప్పుడూ అంచనాలను పెంచేస్తాయి.;
ప్రభాస్ ప్రతి ప్రాజెక్ట్‌ను ఓ కొత్త లెవెల్ కు తీసుకెళ్లే హీరో. ఆయన కొత్త సినిమాల ప్రకటనలు ఎప్పుడూ అంచనాలను పెంచేస్తాయి. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి ‘బక’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. మహాభారతంలోని బకాసురుడి కథ ఆధారంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్, మరోసారి ప్రభాస్ క్రేజ్‌ను పెంచేలా ఉండబోతుందని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ తన ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు, ‘హనుమాన్’ కథను మరో దశకి తీసుకెళ్లేందుకు ‘జై హనుమాన్’ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఈ యూనివర్స్‌లో భాగంగా ప్రభాస్‌తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారని, అందుకు ‘బక’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు వచ్చిన పౌరాణిక, మైథలాజికల్ సినిమాల నుంచి ఈ సినిమా పూర్తిగా విభిన్నంగా ఉండబోతుందట. ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఈ కొత్త ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసికున్నాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాడని రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ‘కల్కి 2898 AD’, ‘సలార్ 2’, ‘రాజా సాబ్’ లాంటి భారీ సినిమాల్లో నటిస్తూనే, ప్రశాంత్ వర్మ సినిమాను అంగీకరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రం పూర్తి స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ గా ఉండబోతుందని, ప్రభాస్ మరోసారి అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. మహాభారతంలో బకాసురుడు అనే రాక్షసుడి కథ అందరికీ తెలిసినదే. గ్రామస్తుల నుంచి బలిగా మనుషులను తీసుకునే బకాసురుడి ప్రస్థానం, ఆఖరికి భీముడి చేతిలో అతను ఎలా ఓడిపోయాడన్నదే ప్రధాన కథ. అయితే, ప్రశాంత్ వర్మ ఈ కథను మరో లెవెల్‌కి తీసుకెళ్లి, మోడరన్ స్టైల్‌లో మలచబోతున్నాడని సమాచారం.
ఈ ప్రాజెక్ట్ కూడా ఆయన క్రియేట్ చేస్తున్న మైథలాజికల్ యూనివర్స్‌లో భాగమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ‘బక’ గురించి అధికారికంగా ఏ సమాచారం రాలేదు. కానీ టాలీవుడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ పైన బిగ్ బజ్ నడుస్తోంది. ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ మైథలాజికల్ ఫ్రాంచైజీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాడని, అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని టాక్. మరి, ‘బక’ అఫీషియల్‌గా ఎప్పుడెప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.