శ్రీలీలకు చిరు సత్కారం
అయితే అదే రోజు టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కూడా చిరంజీవిని కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అందరికీ షాకిచ్చింది.;
మెగాస్టార్ చిరంజీవి ఉమెన్స్ డే సందర్భంగా తన చెల్లెళ్లు మాధవి రావు, విజయ దుర్గ, తల్లి అంజనీదేవి, భార్య సురేఖతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ తనతో పని చేసిన హీరోయిన్లతో పాటూ ప్రతీ ఒక్కరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కూడా చిరంజీవిని కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అందరికీ షాకిచ్చింది.
ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో జరుగుతుంది. అదే స్టూడియోలో మరో షూటింగ్ లో ఉన్న శ్రీలీల, చిరంజీవి అక్కడే ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని ఆయన్ను కలవడానికి విశ్వంభర సెట్స్ కు వెళ్లింది. ఆ రోజు ఉమెన్స్ డే కావడంతో చిరంజీవి అక్కడే శ్రీలీలను శాలువా కప్పి సన్మానించి దుర్గాదేవి ప్రతిరూపమున్న శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు.
ఈ విషయాన్ని స్వయంగా శ్రీలీలనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఓజీ శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటూ మెగాస్టార్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది శ్రీలీల. మెగాస్టార్ ఆమెకు ఇచ్చిన ఆతిథ్యానికి ఎంతో సంబరపడిపోయిన శ్రీలీల, సెట్స్ లో తాను తిన్న రుచికరమైన ఉప్మా మరియు దోసెల గురించి కూడా ప్రస్తావించింది.
ఉమెన్స్ డో రోజున చిరంజీవి గారు తనకు ఇచ్చిన బహుమతి చాలా ప్రత్యేకమని శ్రీలీల ఆ ఫోటోలను షేర్ చేస్తూ చెప్పుకొచ్చింది. ఇక శ్రీలీల నటించిన రాబిన్‌హుడ్ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుండగా, ఈ సినిమా ప్రమోషన్స్ డిఫరెంట్ గా జరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో పాటూ బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్న ఆషికి3 కోసం కూడా శ్రీలీల రెడీ అవుతుంది. మొత్తానికి శ్రీలీల పలు ఇండస్ట్రీల్లో తన సత్తా చాటుతూ రోజురోజుకీ మరింత బిజీగా మారిపోతుంది.