పెళ్లి సమయంలోనే నా తల్లిదండ్రులు అనుమానం..!

కిరణ్ రావుకు విడాకులు ఇవ్వడంతో అమీర్‌ ఖాన్‌ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.;

Update: 2025-03-10 12:30 GMT

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ రెండో భార్య కిరణ్ రావుకు ఇటీవల విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. విడాకుల తర్వాత కూడా వీరిద్దరు తరచు కలవడం, కొన్ని సినిమాలను సహ భాగస్వామ్యంతో చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య ఆస్కార్‌ అవార్డ్‌కి నామినేట్‌ అయిన సినిమా ప్రమోషన్‌ కోసం అమీర్‌ ఖాన్‌ తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి పబ్లిసిటీ లో పాల్గొన్న విషయం తెల్సిందే. కిరణ్ రావుకు విడాకులు ఇవ్వడంతో అమీర్‌ ఖాన్‌ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ వయసులో విడాకులు అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తే, ఇన్నాళ్లు కిరణ్ రావు ప్రతిభను తొక్కేసి ఇప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చి విడుదల కల్పించావా అంటూ విమర్శించిన వారు ఉన్నారు.

ఇటీవల కిరణ్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా చిన్నప్పటి నుంచి ఏదైతే కావాలని కలలు కంటున్నానో, జీవితంలో ఎలాంటి లక్ష్యాలను తాను నిర్ధేశించుకున్నానో తల్లిదండ్రులకు బాగా తెలుసు. అందుకే నేను ఆమీర్‌ ఖాన్‌ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ఒకింత అనుమానం వ్యక్తం చేశారు. స్టార్‌ ఫ్యామిలీలోకి వెళ్లిన సమయంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటి మధ్య నీ లక్ష్యాలను నువ్వు చేరుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఆ సమయంలో నేను ఆయన్ను పెళ్లి చేసుకోవడం కోసం దేనికి అయినా సిద్ధం అయ్యాను. అయితే పెళ్లి తర్వాత తల్లిదండ్రులు అనుమానించింది నిజమే అయింది.

నా పర్సనల్‌ లైఫ్‌ ను చాలా వరకు కోల్పోయాను. స్టార్ ప్యామిలీ అయినప్పటికీ అందరు నన్ను కుటుంబంలోకి సాదరంగా స్వీకరించారు. ప్రతి ఒక్కరితోనూ మంచి రిలేషన్ ఉండేది. ఆమీర్ ఖాన్ సైతం నన్ను కొన్నాళ్ల తర్వాత ప్రోత్సహించారు. నాలోని అభిరుచిని గుర్తించిన ఆయన నాకు తగ్గట్లుగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చే వారు. మేము విడాకులు తీసుకున్నప్పటికీ మంచి స్నేహితులుగానే కొనసాగుతాం. ఇప్పటికీ ఆయనతో వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిరణ్‌ రావు చెప్పుకొచ్చారు. మేము భార్య భర్తలుగా విడిపోయినా ఎప్పటికీ ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం, ఏ అవసరం వచ్చినా ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటామని కిరణ్ రావు పేర్కొన్నారు.

లగాన్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, కిరణ్ రావును ఆమీర్ ఖాన్‌ రెండో వివాహం చేసుకున్నాడు అనే విషయం తెల్సిందే. అమీర్‌ ఖాన్ ఆరు పదుల వయసులో రెండో భార్యకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అయితే మూడో పెళ్లి విషయంలో అమీర్ ఖాన్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో మూడో పెళ్లి వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఆరు పదుల వయసులో ఉన్నాడు కనుక ఆమీర్‌ ఖాన్ పెళ్లికి సిద్ధంగా లేడనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఆమీర్‌ ఖాన్ తన పిల్లల సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. త్వరలోనే ఆయన హీరోగా సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News