'దిల్‌రూబా'.. కిక్కిచ్చే రియాక్షన్ లో కిరణ్ అబ్బవరం
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ స్క్రీనింగ్‌లో కిరణ్ అబ్బవరం సహా చిత్రబృందం మొత్తం సినిమా చూసి ఎగ్జైట్ అయ్యారట.;
సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ హీరో కెరియర్‌ను పూర్తిగా మలుపుతిప్పగలదు. అందుకు ఉదాహరణగా కిరణ్ అబ్బవరం పేరు చెప్పుకోవచ్చు. ‘క’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కిరణ్, బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త చిత్రం ‘దిల్‌రూబా’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
అయితే, ఈ మూవీపై కిరణ్ అబ్బవరం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక స్క్రీనింగ్ వల్ల అతని కాన్ఫిడెన్స్ పై ఓ క్లారిటీ వచ్చిందని చర్చించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ స్క్రీనింగ్‌లో కిరణ్ అబ్బవరం సహా చిత్రబృందం మొత్తం సినిమా చూసి ఎగ్జైట్ అయ్యారట. సినిమా చూసిన తర్వాత కిరణ్ పూర్తి ఉత్సాహంగా కనిపించాడని సమాచారం.
ముఖ్యంగా సినిమా మేకింగ్, కథన శైలి, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి బాగా కిక్కిచ్చినట్లు అతను తన సన్నిహితులకు చెప్పినట్లు టాక్. ఒకవేళ కథ నచ్చకపోతే తాను ఎప్పుడూ ఇలా హైప్లో ఉండడు అని కూడా చెప్పుకున్నాడట. ఇదే కాకుండా, సినిమా మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకున్న కిరణ్ హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, ఆయన కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మెయిన్ హైలైట్ అవుతుందని కిరణ్ అభిప్రాయపడ్డాడు.
ఇకపోతే ఈ చిత్రంలోని కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. లవ్ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ మిక్స్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ మాస్ అండ్ రొమాన్స్ మిక్స్‌గా ఉండేలా డిజైన్ చేసినట్లు ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. లవ్, బ్రేకప్, వయలెన్స్ అన్నీ మిక్స్ చేసి చూపించడంతో ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుందనిపిస్తోంది.
ఇప్పటికే హైప్ బాగానే ఉన్న ఈ సినిమాకు, కిరణ్ అబ్బవరం స్క్రీనింగ్ తర్వాత చూపిస్తున్న కాన్ఫిడెన్స్ మరింత బలాన్ని చేకూర్చింది. సినిమా ఎలా వచ్చిందనే దానికంటే, హీరోకు సినిమా మీద ఉన్న నమ్మకమే జనాల్లో ఆసక్తిని పెంచే అంశం. కిరణ్ నమ్మకంతో ఉన్నాడు అంటే, తప్పకుండా మరో హిట్ అందుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. మొత్తానికి, ‘దిల్‌రూబా’ సినిమాకు ప్రత్యేక స్క్రీనింగ్ తరువాత హైప్ మరో లెవెల్‌కి వెళ్లిపోయింది. మార్చి 14న హోళీ సందర్భంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, నిజంగా కిరణ్ అబ్బవరానికి మరో హిట్‌ని అందించగలదా? లేదా అనేది చూడాలి. అలాగే థియేట్రికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులే తేల్చాలి.